Begin typing your search above and press return to search.

డైరెక్టర్, హీరోయిన్ రొమాన్స్ కి 8M...!

ఆయన నుంచి రాబోతున్న ఖైదీ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 April 2024 10:00 AM GMT
డైరెక్టర్, హీరోయిన్ రొమాన్స్ కి 8M...!
X

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో ప్రధానంగా వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఆయన నుంచి వచ్చిన విక్రమ్‌ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి రాబోతున్న ఖైదీ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్న లోకేష్ కనగరాజ్ ను స్క్రీన్‌ పై చూపించేందుకు శృతి హాసన్‌ చేసిన ప్రయత్నం సఫలం అయ్యింది. కమల్‌ హాసన్ బ్యానర్‌ లో శృతి హాసన్ సారధ్యంలో రూపొందిన ఇనిమేల్‌ అనే మ్యూజిక్ వీడియోతో లోకేష్ కనగరాజ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

వారం క్రితం ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మ్యూజిక్‌ వీడియో యూట్యూబ్‌ లో సందడి చేస్తుంది. ఏడు రోజులు కూడా పూర్తి అవ్వకుండానే ఏకంగా 8 మిలియన్ ల వ్యూస్ ను ఈ పాట దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఒక మ్యూజిక్ ఆల్బం ఇంత స్పీడ్‌ గా 8M ల వ్యూస్ ను దక్కించుకోలేదు అంటూ యూట్యూబ్‌ డాటా విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

మార్చి 25న విడుదల అయిన ఈ పాటకు వస్తున్న స్పందన చూసి మేకర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో, హీరోయిన్‌ శృతి హాసన్ కి ఉన్న క్రేజ్‌ కూడా కలిసి వచ్చి ఇనిమేల్‌ మ్యూజిక్‌ ఆల్బం కి మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది, హిట్ టాక్ రావడంతో మంచి వ్యూస్ వస్తున్నాయి.

వీడియో లో లోకేష్ కనగరాజ్ మరియు శృతి హాసన్‌ యొక్క రొమాన్స్ కి అంతా ఫిదా అవుతున్నారు. నిండా అయిదు నిమిషాలు కూడా లేని ఈ మ్యూజిక్ వీడియో లో చాలా విషయాలను శృతి హాసన్ చక్కగా చూపించింది. ప్రేమ లో పడటం, చిన్న విషయాలకు గొడవ పడి విడిపోవడం వంటి విషయాలను ఈ పాటలో చూపించారు.

కమల్‌ హాసన్ ఈ పాటకు నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాకుండా లిరిక్స్ ను కూడా అందించడం వల్ల ఈ పాట స్థాయి మరింత పెరిగింది. లోకేష్ ను స్క్రీన్‌ పై చూస్తూ ఉంటే బాగుందని, ముందు ముందు నటుడిగా వెండి తెరపై లోకేష్ కనగరాజ్ ను చూడాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి లోకేష్‌ నటన ను కంటిన్యూ చేసేనా చూడాలి.