Begin typing your search above and press return to search.

ధనుష్‌ - డీజే టిల్లు... ఓ ఇంట్రస్టింగ్‌ రూమర్‌!

ఇండస్ట్రీలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సిద్దుకు ఎట్టకేలకు బ్రేక్ దక్కింది!

By:  Tupaki Desk   |   1 April 2024 7:26 AM GMT
ధనుష్‌ - డీజే టిల్లు... ఓ ఇంట్రస్టింగ్‌ రూమర్‌!
X

సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డీజే టిల్లును మించి ఈ స్క్వేర్ హిట్ అవ్వడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇండస్ట్రీలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సిద్దుకు ఎట్టకేలకు బ్రేక్ దక్కింది. ఇదే ఊపులో టిల్లు క్యూబ్‌ కూడా రాబోతుందని ప్రకటన వచ్చింది.

టిల్లు క్యూబ్‌ కంటే ముందు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జాక్ అనే టైటిల్‌ తో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్‌ మెల్ల మెల్లగా సాగుతూ ఉంది. టిల్లు స్క్వేర్ విడుదల అవ్వడంతో సిద్దు మొత్తం దృష్టి జాక్‌ పై పెట్టే అవకాశం ఉంది.

జాక్ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విషయం ఏంటంటే.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ మొదట జాక్ సినిమా కథ ను ధనుష్ కి వినిపించాడట. కథ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ధనుష్ ను దృష్టిలో పెట్టుకునే బొమ్మరిల్లు భాస్కర్‌ రాశాడట.

కథ విషయంలో ధనుష్ ను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ సంతృప్తిపరచడంలో విఫలం అయ్యాడట. దాంతో అదే కథ ను చిన్న చిన్న మార్పులతో డీజే టిల్లు హిట్ తో జోష్‌ మీద ఉన్న సిద్దు జొన్నలగడ్డ వద్దకు తీసుకు వెళ్లాడట. ఆయన కథ విషయంలో నమ్మకం వ్యక్తపరిచి ఓకే చెప్పాడట.

ధనుష్ నో చెప్పిన జాక్‌ సినిమా ను ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ హిట్‌ అవ్వడంతో జాక్‌ సినిమా పై కచ్చితంగా అంచనాలు పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. మరి అంతటి అంచనాలను బొమ్మరిల్లు భాస్కర్ ఎంత వరకు హ్యాండిల్‌ చేయగలడు అనేది చూడాలి.

రైటింగ్‌ విషయంలో సిద్దు జొన్నలగడ్డకు మంచి పట్టు ఉంది. కనుక జాక్ కథ మరియు స్క్రిప్ట్‌ విషయంలో సిద్దు వేలు పెట్టి ఉంటే తప్పకుండా మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ధనుష్ కోసం అనుకున్న కథ ను సిద్దు కి అనుగుణంగా దర్శకుడు ఎలా మార్చి ఉంటాడా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ శైలి కి సిద్దు శైలి కి చాలా కాస్త వైవిధ్యం ఉంటుంది. మరి వీరి కాంబో మూవీ ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.