Begin typing your search above and press return to search.

హరీష్ శంకర్.. ఇది లక్కీ ఛాన్స్

హరీష్ శంకర్ నుంచి చివరిగా 2019లో గద్ధలకొండ గణేష్ సినిమా వచ్చింది. తరువాత పవన్ కళ్యాణ్ తో మూవీ చేయడం కోసం ఎదురుచూస్తున్నారు

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:25 AM GMT
హరీష్ శంకర్.. ఇది లక్కీ ఛాన్స్
X

టాలీవుడ్ లో టాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్స్ పేర్లు చెబితే కచ్చితంగా వారిలో హరీష్ శంకర్ ఉంటాడు. చేసిన సినిమాలు తక్కువే అయిన కమర్షియల్ సక్సెస్ లు ఎక్కువ వచ్చాయి. మిరపకాయ్ తో మొదలు పెడితే గద్దలకొండ గణేష్ వరకు ఏడు సినిమాలు చేస్తే అందులో రెండు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి.మిగిలిన ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. నిర్మాతలకి కాసుల వర్షం కురిపించాయి.

హరీష్ శంకర్ నుంచి చివరిగా 2019లో గద్ధలకొండ గణేష్ సినిమా వచ్చింది. తరువాత పవన్ కళ్యాణ్ తో మూవీ చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన కోసం ముందు ఒక కథ సిద్ధం చేసిన తరువాత తెరి రీమేక్ కి వెళ్ళారు. మైత్రీ మూవీ మేకర్స్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు.

ఇన్నేళ్ళ నిరీక్షణకి ఫలితం వచ్చిందని అందరూ భావిస్తోన్న తరుణంలో తెలంగాణ ఎన్నికలు వచ్చేశాయి. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికల సందడి షురూ అవుతోంది. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకి డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగా అతను కమిట్ అయిన సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్ లు నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళిపోయాయి.

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ సినిమాలు మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వాయిదా పడటంతో హరీష్ శంకర్ రవితేజకి ఓ కథ చెప్పి మెప్పించాడంట. అయితే గోపీచంద్ మలినేని మూవీ ఉండటంతో అది అప్పుడే పట్టాలెక్కదు అనుకున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ లో రవితేజ, గోపీచంద్ కాంబో లో సెట్ అయిన ఆ సినిమా ఆగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

బడ్జెట్ ఇష్యూ కారణంగా సినిమాని ప్రస్తుతానికి నిర్మాతలు హోల్డ్ లో పెట్టారంట. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ కి లైన్ క్లియర్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్.