Begin typing your search above and press return to search.

స‌నాత‌న ధ‌ర్మాన్ని విమ‌ర్శించ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది: హ‌రీష్ శంక‌ర్‌

స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ హిందూ ధ‌ర్మంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌నం యాక్సెప్ట‌ర్స్ అని, హిందూ ధ‌ర్మంలోనే ఉంది ప‌ర‌మ‌త స‌హ‌నం

By:  Tupaki Desk   |   19 Oct 2023 7:30 AM GMT
స‌నాత‌న ధ‌ర్మాన్ని విమ‌ర్శించ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది: హ‌రీష్ శంక‌ర్‌
X

స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ హిందూ ధ‌ర్మంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌నం యాక్సెప్ట‌ర్స్ అని, హిందూ ధ‌ర్మంలోనే ఉంది ప‌ర‌మ‌త స‌హ‌నం. అందు వ‌ల్లే ఇత‌ర మ‌తాల‌న్నీ మ‌న దేశంలో స్వేచ్ఛ‌గా వ్యాపించిందంటే దానికి కార‌ణం హిందూ ధ‌ర్మం' అన్నారు. 'స‌ర్వం శ‌క్తి మ‌యం' పేరుతో రూపొందిన వెబ్ సిరీస్ టీమ్ హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌, న‌టుడు త‌నికెళ్ల భ‌ర‌ణి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ హిందూ ధ‌ర్మంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందూ మ‌తం బొట్టు పెట్ట‌మ‌ని చెబుతుంద‌ని, హిందూ ధ‌ర్మం ప‌క్కోడికి అన్నం పెట్ట‌మంటుందన్నారు. 'స‌ర్వం శ‌క్తిమ‌యం'ప్రాజెక్ట్ దైవ సంక‌ల్పం. కొంత మందికి అర్థం కానంత మాత్రాన దైవం లేద‌ని కాదు. రూపం లేనివాడే భ‌గ‌వంతుడు. హిందూ మ‌తం వేరు, హిందూ ధ‌ర్మం వేరు. భార‌త దేశం హిందూ మ‌తంతో ఉన్న‌ప్ప‌టికీ హిందూ ధ‌ర్మం మీద నిల‌బ‌డిన దేశం.

డిఫ‌రెన్స్ ఏంటంటే హిందూ మ‌తం బొట్టు పెట్టండీ అని చెబుతుంది. హిందూ ధ‌ర్మం ప‌క్కోడికి అన్నం పెట్టండి అని చెబుతుంది. ఆ అన్నం తినేవాడికి బొట్టు ఉందా లేదా చూడ‌దు. కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాలుగా ఇస్లాం కానీ, క్రిస్టియానిటీకానీ, బుద్ధిజం కానీ జైనిజం కానీ ఇంత స్వేచ్ఛ‌గా వ్యాపించిందంటే దానిక కార‌ణం హిందూ ధర్మం అన్నారు. ఈ మ‌ధ్య స‌నాత‌న‌ ధ‌ర్మాన్ని, గుళ్ల‌పై విమ‌ర్శలు చేయ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది.

ఈ ధ‌ర్మాన్ని న‌మ్మో వాళ్లే గుడికి రావాలి. ధ‌ర్మాన్ని ప్ర‌శ్నించేవాడు కాదు. ఇదే డైలాగ్‌ని 'ఉస్తాద్‌ భ‌గ‌త్ సింగ్'లో కూడా రాశా. ధ‌ర్మాన్ని న‌మ్మేవాడే గుడికి రావాలి. ధ‌ర్మం, భ‌క్తి అనేది వ్య‌క్తిగ‌తం. గుడి అనేది ఒక రిలీజియ‌స్ స్లేస్. అది సెక్యుల‌ర్ ప్లేస్ కాదు. చాలా మంది సెక్యుల‌ర్ ముసుగేసుకుని నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతుంటారు. 'స‌ర్వం శ‌క్తి మ‌యం' రిలీజ్‌ని మ‌నం డిజైడ్ చేసింది కాదు. ఇది అమ్మ‌వారు నిర్ణ‌యించింది. న‌వ‌రాత్రుల వేళ అష్టాద‌శ శ‌క్తి పీఠాల‌ను ఇంట్లో కూర్చుని ఈ సిరీస్ ద్వారా మ‌నం చూడ‌టం ఏంటీ?

మ‌తం, సైన్స్ వేర్వేరు కాదు. మ‌తం, సిద్ధాంతం పుట్టిన త‌రువాతే సైన్స్ పుట్టింది. మ‌తంలో ఓ భాగం సైన్స్‌. చంద్ర‌యాన్ చంద్రున్ని తాక‌క ముందు తిరుప‌తికే వెళ్లింది. ఇస్రో కంటే ఎవ‌రు ఇక్క‌డ గొప్ప‌వాళ్లు కారు' అన్నారు హ‌రీష్ శంక‌ర్‌.