Begin typing your search above and press return to search.

బేబీ మ్యూజిక్ బాలేదా? రివ్యూకి డైరెక్టర్ సూపర్ కౌంటర్..!

మ్యూజిక్ డైరెక్టర్ ని ట్యాగ్ చేసి, ఎందుకు బ్రో నాకు చెత్త మ్యూజిక్ ఇచ్చావు అంటూ కామెంట్ చేశారు.

By:  Tupaki Desk   |   17 July 2023 6:50 AM GMT
బేబీ మ్యూజిక్ బాలేదా? రివ్యూకి డైరెక్టర్ సూపర్ కౌంటర్..!
X

రౌడీ హిరో విజయ్ దేవరకొండ సోదరుడిగా ఆనంద్ దేవ‌ర‌కొండ హీరో గా న‌టించిన తాజా చిత్రం బేబీ. ఆయన కెరీర్ లో బెస్ట్ హిట్ గా ఈ సినిమాని చెప్పొచ్చు. ఈ మూవీ లో యూట్యూబర్ వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా టైటిల్ పాత్ర‌లో న‌టించింది. విరాజ్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న'క‌ల‌ర్ ఫొటో' సినిమా కు క‌థ అందించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది

మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ నటకు ప్రశంసల వర్షం కురస్తోంది. అసలు పెద్దగా గుర్తింపు లేని నటీనటుల తో సినిమా తీసి ఊహించని హిట్ అందుకున్నారు. కాగా, ఈ సందర్భంగా బేబీ చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. దాదాపు ఈ మూవీకి అన్నీ పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఈ మూవీ గురించి నెగిటివ్ గా రాయడం గమనార్హం.

ముఖ్యంగా ఈ మూవీ లో మ్యూజిక్ అంత గొప్పగా లేదు అని ఆ రివ్యూవర్ అభిప్రాయం. ప్రేమకథల కు మ్యూజిక్ ప్రాణం అని, అలాంటిది ఈ సినిమా లో పాటలు అంతగా బాలేదు అంటూ వారు రివ్యూలో పేర్కొన్నారు. అది రాసింది ఎవరో తెలీదు కానీ, ఈ రివ్యూ కాస్తా మూవీ డైరెక్టర్ కంట పడింది. ఇంకేముంది వారు దాని పై ఫన్నీగా స్పందించడం విశేషం.

ఈ రివ్యూకి డైరెక్టర్ సాయి రాజేష్ వెంటనే ఓ కామెంట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ని ట్యాగ్ చేసి, ఎందుకు బ్రో నాకు చెత్త మ్యూజిక్ ఇచ్చావు అంటూ కామెంట్ చేశారు. దానికి వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కూడా స్పందించారు. మంచి సాంగ్స్ ఇద్దాం అంటే మీరే తీసుకోలేదు సర్ అంటూ కామెంట్ చేశారు. దీంతో, ఇప్పుడు వీరి కామెంట్స్ వైరల్ గా మారాయి.

నిజం చెప్పాలంటే, ఈ మూవీ కి ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ అనే చెప్పాలి. ఈ మూవీ జనాల్లోకి ఎక్కువగా వెళ్లిందే ఈ మూవీ లో పాటల కారణంగా. మొదట ఆనంద్ పక్కన ఓ యూట్యూబర్ హీరోయిన్ ఏంటి అనుకున్నారు. కానీ, పాటలతో మ్యాజిక్ చేశారు. అలా చేరువై, చివరికి మూవీ లో కంటెంట్ ఉండటంతో హిట్ అయ్యారు. అలాంటి మూవీకి మ్యూజిక్ బాలేదు అని రివ్యూ రాయడం , వారి అజ్ఞానాన్ని తెలియజేస్తుంది.