Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడితో బన్నీ.. ఇది అసలు ప్లాన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Dec 2023 4:02 AM GMT
ఆ దర్శకుడితో బన్నీ.. ఇది అసలు ప్లాన్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే పుష్ప 2 తర్వాత బన్నీతో సినిమాలు చేయడానికి ముగ్గురు స్టార్ దర్శకులు సిద్ధంగా ఉన్నారు. వారిలో ఇద్దరితో ఆల్ రెడీ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి.

ఇప్పుడు లిస్టులోకి తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వచ్చి చేరాడు. షారుఖ్ ఖాన్ జవాన్ మూవీతో హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న అట్లీకి బాలీవుడ్ లెవల్ లో క్రేజ్ వచ్చింది. అయితే ఈ దర్శకుడు మాత్రం నెక్స్ట్ మూవీ సౌత్ హీరోతోనే చేయాలని అనుకుంటున్నారంట. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోతో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

అట్లీ చాలా కాలం నుంచి తెలుగులో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే టైమ్ సెట్ కావడం లేదు. గతంలో ఎన్టీఆర్ తో మూవీ ఫైనల్ అయిపోయింది అనేంత వరకు టాక్ వచ్చింది. మళ్ళీ ఏమైందో ఆ సౌండ్ ఆగిపోయింది. అయితే ఎన్టీఆర్, అట్లీ కాంబోలో మూవీ మాత్రం కచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీలో ఉన్న టాక్. అట్లీ రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసి కథ చెప్పారంట. ఈ కథ నచ్చడంతో బన్నీ వెంటనే ఒకే చెప్పేశారనే మాట వినిపిస్తోంది.

సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిందంట. అలాగే అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయనున్నారంటూ విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అట్లీ ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారని, 2024లోనే ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు.

అతనితో ఓ మైథలాజికల్ కాన్సెప్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి-సిరీస్ కి ఓ మూవీ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీనుతో ఒక ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మూడు స్టార్ట్ కాకుండా అట్లీతో సినిమా అంటే ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్. ఇది ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాలి.