Begin typing your search above and press return to search.

వలపుల వల.. నిర్మాత విలవిల.. మధ్యలో డైరెక్టర్ అరెస్ట్!

వివరాళ్లోకి వెళ్తే... ఒక నిర్మాతలకు వలపన్ని.. డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన దర్శకుడిని బెంగళూరు నగర పడమటి విభాగం పోలీసులు అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 3:07 PM GMT
వలపుల వల.. నిర్మాత విలవిల.. మధ్యలో డైరెక్టర్  అరెస్ట్!
X

రంగుల ప్రపంచంలో వలపుల వలలు అత్యంత సహజం అని చెబుతుంటారు. ఈ క్రమంలో ఎదురయ్యే వలపుల వలలు.. అందులో చిక్కుకున్న వారి విలవిలలు అప్పుడప్పుడూ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. అనంతరం వాటి రిజల్ట్ ఏమైందనేది కొన్ని సందర్భాల్లో గుట్టు చప్పుడు కాకుండా మిగిలిపోగా... మరికొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఒక జరిగిన ఒక ఘటన పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

అవును... ఓ యువతి పన్నిన వలపుల వలలో చిక్కిన ఓ నిర్మాత విలవిలలాడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకున్న పోలీసులే విస్తుపోయారని చెబుతున్నారు. ఈ ఘటనలో ఒక యువతి వలపుల వల వేయగా.. అందులో నిర్మాత విలవిల్లాడగా.. తాజాగా దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ కథాకమీషేమిటో ఇప్పుడు చూద్దాం!

వివరాళ్లోకి వెళ్తే... ఒక నిర్మాతలకు వలపన్ని.. డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన దర్శకుడిని బెంగళూరు నగర పడమటి విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా యువతుల సాయంతో లైంగిక బెదిరింపులకు పాల్పడటం.. అనంతరం నిర్మాతల నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించడం అమలుచేస్తున్నాడు ఒక దర్శకుడు. తాజాగా ఈ పథకాన్ని వమ్ము చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

తాజాగా ఒక నిర్మాత వద్దకు యువతులను పంపించడం.. అనంతరం బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కోసం బెదిరించడం వంటి ఆరోపణలను పరిగణలోనికి తీసుకుని దర్శకుడి ఆటకట్టించారు పోలీసులు. ఈ సమయంలో తనకు ఎదురైన ఇబ్బందిని బాధిత నిర్మాత నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు జరుగుతుందని తెలుస్తుంది.