Begin typing your search above and press return to search.

ఆ బిగ్ స్టార్ తో అనుదీప్.. అంత ఈజీ కాదు!

యువ దర్శకుడు అనుదీప్ జాతి రత్నాలు సినిమాతో ఇండస్ట్రీ దృష్టినే గట్టిగానే ఆకర్షించాడు అతని కామెడీ టైమింగ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది

By:  Tupaki Desk   |   14 March 2024 7:30 AM GMT
ఆ బిగ్ స్టార్ తో అనుదీప్.. అంత ఈజీ కాదు!
X

యువ దర్శకుడు అనుదీప్ జాతి రత్నాలు సినిమాతో ఇండస్ట్రీ దృష్టినే గట్టిగానే ఆకర్షించాడు అతని కామెడీ టైమింగ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మధ్యకాలంలో పెట్టిన పెట్టుబడికి అత్యధిక స్థాయిలో మంచి ప్రాఫిట్ అందించిన కామెడీ సినిమాల్లో జాతి రత్నాలు సినిమా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక బాహ్య ప్రపంచంలో కూడా అతనికి యువతలో అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అతను మాట్లాడే మాటలు చేష్టలు నార్మల్ ఆడియన్స్ కు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ప్రముఖ నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి చర్చలు అయితే జరుపుతున్నారు. కానీ అనుదీప్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అందరికీ వెంటనే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు. జాతి రత్నాలు సినిమా తర్వాత అతను చేసిన ప్రిన్స్ సినిమా కాస్త గట్టి దెబ్బ కొట్టింది.

లక్కులో జాతి రత్నాలు సినిమాతో సక్సెస్ కొట్టాడు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక నెక్స్ట్ సినిమాతో మాత్రం అనుదీప్ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ గా సక్సెస్ కొట్టి చూపించాలి. ప్రస్తుతం లైనప్ లో అతనికే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. నవీన్ పోలిశెట్టితోనే ఒక సినిమా చేయబోతున్నాడు. అలాగే రవితేజతో కూడా ఒక స్క్రిప్ట్ ఓకే కావాల్సి ఉంది. ప్రస్తుతం చర్చలో దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టులలో ఏది మొదట స్టార్ట్ అవుతుంది అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.

అయితే అనుదీప్ పై ఇప్పుడు మెగాస్టార్ కూడా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను పర్ఫెక్ట్ స్టోరీ సిద్ధం చేస్తే కనుక సినిమా చేయాలి అని మెగాస్టార్ ఆలోచన చేసినట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు అనుదీప్ తో మాట్లాడిన మెగాస్టార్ స్టోరీ లైన్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే మెగాస్టార్ చిరంజీవిని డీల్ చేయడం అంత సాధారణమైన విషయం కాదు అనేది అనుదీప్ కి కూడా బాగా తెలిసి ఉండవచ్చు. అనుదీప్ టైమింగ్ కి, మెగాస్టార్ టైమింగ్ కి ఎలాంటి కధ అయితే సింక్ అవుతుంది అనేది అసలు చిక్కుముడి. ముందు కథ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమాత్రం తేడా కొట్టినా కూడా ఫలితం ఊహించని తరహాలోనే ఉంటుంది కాబట్టి ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకున్నా తప్పులేదు.

ముందుగా అతను రవితేజతో ఒక మంచి సక్సెస్ అందుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రవితేజను హ్యాండిల్ చేయగలిగితే ఆ తర్వాత మెగాస్టార్ ఆలోచన లేకుండా అతనికి పిలిచి మరి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి అనుదీప్ మెగాస్టార్ ను ఎ విధంగా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.