Begin typing your search above and press return to search.

వశిష్ట తండ్రి.. ఇరకాటంలో పెట్టేశారుగా..

అయితే ఇప్పుడు వశిష్ట తండ్రి సత్యనారాయణ రెడ్డి చేస్తున్న కామెంట్స్ నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

By:  Tupaki Desk   |   14 April 2025 5:07 PM IST
వశిష్ట తండ్రి.. ఇరకాటంలో పెట్టేశారుగా..
X

డైరెక్టర్ వశిష్ట గురించి అందరికీ తెలిసిందే. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు డైరెక్టర్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. కొన్ని కారణాల వల్ల డెబ్యూ మూవీ థియేటర్లలో రిలీజ్ అవ్వకపోవడంతో.. వశిష్ట డైరెక్షన్ వైపు మొగ్గు చూపారు. దర్శకులు జయంత్, వినాయక్ తో పాటు కొందరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

ఆ తర్వాత బింబిసారతో డైరెక్టర్ గా మారారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. అదే సమయంలో తన రెండో మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ సొంతం చేసుకున్నారు. వారి కాంబోలో విశ్వంభర రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

మరికొద్ది రోజుల్లో విశ్వంభర మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 24న రిలీజ్ అవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. అయితే వశిష్ట హార్డ్ వర్క్ గురించి అందరికీ తెలిసిందే. బింబిసార మూవీతో తన టాలెంట్ ఏంటో ఓ రేంజ్ లో ప్రూవ్ చేసుకున్నారు.

దీంతో విశ్వంభరపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు వశిష్ట తండ్రి సత్యనారాయణ రెడ్డి చేస్తున్న కామెంట్స్ నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢీ, బన్నీ, భగీరథ వంటి పలు చిత్రాలు నిర్మించి ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఆయన.. రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఇటీవల విశ్వంభర మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ పై ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. వీఎఫ్ ఎక్స్ వర్క్ బాగాలేదని, హాలీవుడ్ మూవీస్ నుంచి సీన్స్ కాపీ చేశారని కామెంట్స్ వచ్చాయి. అయితే వశిష్ట తండ్రి.. ఏఐ సహాయంతో టీజర్ రూపొందించారని చెప్పారు. అది గ్రాఫిక్స్ వర్క్ కాదని, వీఎఫ్ ఎక్స్ విషయంలో ఇబ్బందులు లేవన్నారు.

అయితే టీజర్ లో వీఎఫ్ ఎక్స్ ఫ్లాప్ అయిందని అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వ్యాఖ్యలు ఎవరూ నమ్మరనే చెప్పాలి. ఆ తర్వాత రీసెంట్ గా వశిష్టకు, తన నిర్మాణ సంస్థకు హీరో నితిన్ హమీ ఇచ్చి, నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రూ.75 లక్షలు తీసుకుని హ్యాండ్ ఇచ్చారని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

అందులో నిజమెంతో ఉందో తెలియదు కానీ.. నెట్టింట మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఇప్పుడు చిరుతో చేసిన మూవీ.. సూపర్ హిట్ అయితే వశిష్ట కెరీర్ కు ఇక తిరుగుండదు. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయన తండ్రి చేస్తున్న వ్యాఖ్యలు ఏ మాత్రం కూడా లాభం చేకూర్చవు. నష్టం చేకూర్చకపోతే చాలు.