Begin typing your search above and press return to search.

తెలుగు రాదు, ప్రభాస్‌తో నా వల్ల కాదు..!

అందుకే గతంలో ఒక దర్శకుడు ప్రభాస్‌తో సినిమా అంటే నా వల్ల కాదు అన్నాడట. తెలుగు భాష రాదు అనే సాకు చెప్పి సినిమా ను చేయకుండా తప్పకున్నాడట

By:  Tupaki Desk   |   12 July 2025 12:00 PM IST
తెలుగు రాదు, ప్రభాస్‌తో నా వల్ల కాదు..!
X

ప్రభాస్ ప్రస్తుతం పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌. ఆయన సినిమాలో చిన్న పాత్రను చేసేందుకు సైతం ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఆసక్తి కనబరుస్తున్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రభాస్‌కి అభిమానులు ఉంటారు. అంతే కాకుండా ఆయనతో వర్క్‌ చేయడానికి అన్ని భాషల సినిమా టెక్నీషియన్స్‌ రెడీగా ఉంటారు. అలాంటి పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌తో సినిమాను చేసే అవకాశం దక్కితే ఏ దర్శకుడు అయినా నో చెబుతాడా... ఖచ్చితంగా నో అని చెప్పడు. ఒక వేళ ఏ దర్శకుడు అయినా ప్రభాస్‌తో సినిమా చేయలేను అని తప్పుకున్నాడు అంటే అతడు పెద్ద దురదృష్టవంతుడు అనుకోవాలి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటికి ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తీరు, క్రేజ్‌, స్టార్‌డం మొత్తం మారింది. ఇంతకు ముందు మీడియం రేంజ్‌ సినిమాలు చేస్తూ ఉండేవారు, కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరగడంతో ఆ స్థాయి సినిమాలు చేస్తున్నాడు. అంతే కాకుండా తన స్టార్‌డంకి తగ్గట్లుగా వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్నాడు. కానీ బాహుబలి ముందు ప్రభాస్ అంటే కనీసం సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో తెలియదు. అందుకే గతంలో ఒక దర్శకుడు ప్రభాస్‌తో సినిమా అంటే నా వల్ల కాదు అన్నాడట. తెలుగు భాష రాదు అనే సాకు చెప్పి సినిమా ను చేయకుండా తప్పకున్నాడట, ప్రభాస్‌తో అప్పుడు సినిమా మిస్‌ చేసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతూ ఉంటాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... కన్నడ దర్శకుడు ప్రేమ్‌ తాజాగా 'కేడీ' అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో దర్శకుడు ప్రేమ్‌ మాట్లాడుతూ దాదాపు ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. ప్రేమ్‌ దర్శకత్వంలో శివ రాజ్‌ కుమార్‌ దర్శకత్వంలో 'జోగి' అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కన్నడంలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఓ నిర్మాత హక్కులు కొనుగోలు చేయడం జరిగిందట. ప్రభాస్‌తో ఆ సినిమాను రీమేక్‌ చేశారు, యోగి అనే టైటిల్‌తో ప్రభాస్ హీరోగా వి వి నాయక్ దర్శకత్వంలో సినిమా వచ్చింది.

యోగి సినిమాకు వినాయక్‌ కంటే ముందు దర్శకుడిగా ప్రేమ్‌ను అనుకున్నారట. జోగి సినిమాను అతడు తీసిన విధానం నచ్చి నిర్మాత ఆయనతోనే ఈ రీమేక్ చేయిస్తే బాగుంటుందని, అదే ఫీల్‌ కంటిన్యూ అవుతుందని భావించాడట. కానీ ప్రేమ్‌ ఆ సమయంలో తెలుగు రాదని, ప్రభాస్‌తో యోగి సినిమాను తీయడం తన వల్ల కాదని చెప్పాడట. దాంతో ప్రేమ్‌ స్థానంలో వినాయక్‌ వచ్చి చేరాడు. ఒకవేళ ఆ సమయంలో ప్రేమ్‌ యోగి సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే ఆయన కెరీర్‌ మరోలా ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

ఆ సమయంలో ప్రభాస్‌కి అంత స్టార్‌డం లేదు. అందుకే ప్రేమ్‌ యోగి సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఆసక్తి చూపించి ఉండడు అని కొందరు అంటున్నారు. శివ రాజ్‌ కుమార్‌ వంటి సూపర్‌ స్టార్‌తో సినిమాను తీసిన దర్శకుడు కొత్త కుర్రాడితో సినిమా అంటే తీసేందుకు ఆసక్తి చూపించడు. ప్రేమ్‌ కూడా ఆ సమయంలో అదే పరిస్థితిలో ఉండి ఉంటాడు. అందుకే యోగి సినిమాను మెల్లగా స్కిప్‌ చేసి ఉంటాడని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.