Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ తో తీసిన డైరెక్టర్ కి ఛాన్స్ లేకుండా పోయిందే..?

డైరెక్టర్ గా ఎప్పుడూ సక్సెస్ ఫుల్ సినిమాలు అందించే వారికే సినిమా వెంట సినిమా ఛాన్స్ లు వస్తాయి.

By:  Tupaki Desk   |   11 May 2025 3:00 AM IST
From Geetha Govindam to Uncertainty: Parasurams Rise and Fall
X

డైరెక్టర్ గా ఎప్పుడూ సక్సెస్ ఫుల్ సినిమాలు అందించే వారికే సినిమా వెంట సినిమా ఛాన్స్ లు వస్తాయి. ఒక్కోసారి కొన్ని సినిమాలు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకపోయినా సరే ఆ డైరెక్టర్ టాలెంట్ తెలుసు కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చేద్దాం అన్నట్టుగా నిర్మాతల కమిట్మెంట్ ఉంటుంది. ఐతే కొంతమంది దర్శకులకు మాత్రం ఒక ఫ్లాప్ పడిందా అంతే కెరీరే క్లోజ్ అన్నట్టుగా ఉంటుంది. అలాంటి డైరెక్టర్స్ తెలుగులో చాలామంది ఉండగా సూపర్ స్టార్ మహేష్ తో సినిమా తీసి కూడా ఆ లిస్ట్ లో ఉన్నాడు డైరెక్టర్ పరశురామ్ పేట్ల.

యువ హీరోలతో సినిమాలు తీస్తూ సక్సెస్ లు కొడుతున్న పరశురామ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో గీతా గోవిందం సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి అతను తెలుగులో మరో స్టార్ డైరెక్టర్ అనే టాక్ వినిపించింది. ఐతే ఆ తర్వాత మాత్రం అతని సినిమాలు ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేదు. అయినా సరే అతని టాలెంట్ గుర్తించి సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా చేశాడు. మహేష్ పరశురామ్ తో సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ కూడా కన్ ఫ్యూజ్ అయ్యారు. కానీ కథ నచ్చి డైరెక్టర్ కి ఓకే చెప్పాడని కన్విన్స్ అయ్యారు.

ఎస్.వి.పి ఆశించిన స్థాయిలో లేకపోయినా మహేష్ ని బాగానే చూపించాడని ఫీల్ అయ్యారు. ఇక ఆ తర్వాత గీత గోవిందం కాంబోలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు పరశురామ్. ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో అది ఆ అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఫైనల్ గా సినిమా ఫ్లాప్ అయ్యింది. ఐతే ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. అతనితో కథా చర్చలు కూడా ఎవరు నిర్వహించట్లేదని టాక్.

పరశురామ్ ఒకరికి కథ చెప్పి ఆ హీరో కనీసం ఆలోచించుకుని చెబుతా అన్న టైం లో మరో హీరో ఓకే చేస్తే అతనితో సినిమా మొదలు పెడతాడు అన్న టాక్ ఉంది. ఈ విషయంలోనే నాగ చైతన్య పరశురామ్ మీద కాస్త గుర్రుగా ఉన్నాడు. ది ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పరశురామ్ ప్రస్తుతం కెరీర్ లో టఫ్ టైం ని ఫేస్ చేస్తున్నాడు.