మా కోసమే సినిమా తీశావ్.. ఫ్యాన్స్ రియాక్షన్ పై డైరెక్టర్ కామెంట్స్..!
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా గురువారం రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
By: Tupaki Desk | 29 Nov 2025 9:14 AM ISTఆంధ్రా కింగ్ తాలూకా సినిమా గురువారం రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. రామ్, భాగ్య శ్రీ బోర్స్ జంటగా నటించిన ఈ సినిమాలో ఏదైతే టైటిల్ లో ట్యాగ్ గా పెట్టాడో ఒక ఫ్యాన్ బయోపిక్ అని దానికి న్యాయం జరిగిందని ఆడియన్స్ అంటున్నారు. అంతేకాదు డైరెక్టర్ మహేష్ బాబు పి ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఫ్యాన్స్ స్పెషల్ గా తనకు ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని వెల్లడించారు.
అన్న మా కోసమే ఒక సినిమా తీశావ్..
అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి అన్న మా కోసమే ఒక సినిమా తీశావ్ అంటూ చాలా ఎమోషనల్ అయ్యారని చెప్పారు డైరెక్టర్ మహేష్. మహేష్ సిటీ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లు కూడా క్లైమాక్స్ లో నన్ను నేను చూసుకున్నట్టు ఉందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ గిరి అని ఆయన కూడా ఇంతవరకు నేను ఎన్టీఆర్ ని కలవలేదు. కలిస్తే ఏం చెప్పాలో ఆ మాటలన్నీ నాకు స్క్రీన్ పై కనిపించాయని ఎమోషనల్ అయ్యాడని చెప్పారు మహేష్ బాబు.
సో డైరెక్టర్ హీరో ఏదైతే ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ హీరో అభిమానికి నచ్చాలని అనుకున్నారో అది రీచ్ అయ్యింది. రామ్ తాను నటించిన ఫ్యాన్ బాయ్ గా తన ఎనర్జీతో సినిమాకు సూపర్ క్రేజ్ తెచ్చాడు. ఇక సినిమాలో ఆంధ్రా కింగ్ గా ఉపేంద్ర కూడా కనిపించిన ప్రతిసారి ఇంప్రెస్ చేశారు.
మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ..
ఈ సినిమాలో రామ్, భాగ్య శ్రీ జోడీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ ఆ సినిమా తర్వాత కింగ్ డమ్, కాంత సినిమాలు చేసిన లాస్ట్ 3 సినిమాల కన్నా ఆంధ్రా కింగ్ తాలూకా తోనే ఆమె లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా సక్సెస్ పరంగా కూడా సూపర్ అనిపించుకుంది.
ఇలాంటి ఒక కథ తన దగ్గరకు వచ్చినప్పుడు రామ్ జెన్యూన్ గా ఇది అందరి హీరోల ఫ్యాన్స్ ని టచ్ చేస్తుందని నమ్మాడు. అదే ఇప్పుడు సినిమా చూసిన ఫ్యాన్స్ నుంచి వస్తున్న రియాక్షన్. ఇలా ఒక హీరో సినిమాను మిగతా స్టార్ ఫ్యాన్స్ కూడా తమని తాము చూసుకునే రేంజ్ లో ఉంది అంటే ఆ సినిమాకు అంతకన్నా సక్సెస్ మరోటి ఉండదు. ఈ విషయంలో డైరెక్టర్ మహేష్ సూపర్ హిట్ అనిపించుకోగా రామ్ కూడా ఈ కథను యాక్సెప్ట్ చేసి తన ఎనర్జీతో మరింత క్రేజ్ తెచ్చాడు.
తెలుగు తెర మీద ఇలా ఒక ఫ్యాన్స్ కథతో సినిమాలు ఇప్పటివరకు రాలేదు. అప్పుడెప్పుడో శ్రీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. అడపాదడపా సినిమాల్లో హీరోలు ఫలనా హీరో ఫ్యాన్ అని మాటల వరకే చెబుతుంటారు. బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అనే సినిమా తీశారు. కానీ ఈ సినిమాలకు అన్నిటికీ ఆంధ్రా కింగ్ తాలూకా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు.
