Begin typing your search above and press return to search.

న‌న్ను త‌రిమేయండంటూ హీరో స‌వాల్!

ఇటీవ‌లే ముంబైలో మ‌రాఠీ మాట్లాడ‌లేద‌ని ఓస్వీట్ షాప్ య‌జ‌మానిపై దాడి ఘ‌ట‌న సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2025 1:00 AM IST
న‌న్ను త‌రిమేయండంటూ హీరో స‌వాల్!
X

ఇటీవ‌లే ముంబైలో మ‌రాఠీ మాట్లాడ‌లేద‌ని ఓస్వీట్ షాప్ య‌జ‌మానిపై దాడి ఘ‌ట‌న సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం మ‌రాఠీ మాట్లాడ‌నందుకే ఈ ఘాతానికి దుండ‌గ‌లు దాడికి పాల్ప‌డ్డారు. దీనిపై తీవ్ర వ్య‌తిరేక వ్య‌క్త‌మైంది. భాష‌పై మ‌నుషుల‌పై దాడులు చేయ‌డం ఏంట‌ని అంతా మండ ప‌డ్డారు. భాష కోసం మ‌నిషి ప్రాణాలు కూడా లెక్క చేయ‌రా? అంటూ సోష‌ల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోసారు. తాజాగా ఈ ఘ‌ట‌నపై బోజ్ పురీ న‌టుడు, బీజేపీ ఎంపీ దినేష్ లాల్ యాదవ్ న‌న్ను కూడా త‌రిమేయండి అంటూ పెద్ద స‌వాలే విసిరారు.

ఆయ‌న హీరోగా న‌టించిన 'హ‌మ‌ర్ నామ్ బా క‌న్హ‌య్య' చిత్రం ప్ర‌చారంలో భాగంగా ముంబైలో లో ఈ స‌వాల్ చేసారు. 'మ‌రాఠీ మాట్లాడ‌లేద‌ని దాడి చేస్తారా? ఎవ‌రిచ్చారు మీకు ఆ హ‌క్కు? ఇవేం రాజ‌కీయాలు. దేశంలో ఎక్క‌డా ఇలాంటి దాడులు జ‌ర‌గ‌లేదు. దీని వెనుక రాజ‌కీయ కుట్ర ఉంద‌ని...ఇలాంటి వాళ్ల‌కు దూరంగా ఉండ‌ట‌మే మంచిద‌'న్నారు. 'మీకంత ధైర్యం ఉంటే న‌న్ను కూడా మ‌హ‌రాష్ట్ర నుంచి త‌రిమే యండి? నేను మరాఠీ మాట్లాడ‌ను. నాకు వ‌చ్చిన భాష మాత్ర‌మే మాట్లాడుతాను.

నేను రాజ‌కీయ నాయ‌కుడినే. పాలిటిక్స్ తో ప్ర‌జ‌లు జీవితాలు మార్చాలి. సామాన్యుల‌పై దాడులు కాదు. భాషలు నేర్చుకోవాలా? లేదా? అన్న‌ది వాళ్ల ఇష్టం మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఎవ‌రేం భాష‌లు మాట్లా డాలో మీరెలా డిసైడ్ చేస్తారు? మీకు ఎవ‌రిచ్చారు ఆ హ‌క్కు? మ‌నం స‌మాజంలో మ‌నుషుల్లా బ్ర‌త‌కు తున్నామా? మ‌రోలా బ్ర‌తుకుతున్నామా? అన్న‌ది దాడికి పాల్ప‌డిన వారంతా ఆలోచించుకోవాలి.

చ‌ట్ట‌ప‌రంగా వారిపై చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతు న్నాయి. బోజ్ పురీలో దినేష్ లాల్ చాలా సినిమాలు చేసారు. న‌టుడిగా ఆయ‌న‌కంటూ ఓ ఇమేజ్ ఉంది. సామాజిక అంశాల‌పైనే గ‌ళం విప్పుతుంటారు. బాలీవుడ్ లోనూ రాణించాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. అలాగే హిందీ బిగ్ బాస్ సీజ‌న్ 6లో కూడా పాల్గొన్నారు.