Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్​ ఇంట్లో వేణుస్వామి పూజలు నిజమే..

కానీ ఆ సమయంలో పూజల కోసం డింపుల్​ ఎక్కడా నోరువిప్పలేదు. తాజాగా డింపుల్​ హయతి ఇంట్లో జరిగిన పూజల వీడియోను వేణుస్వామి తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 6:42 AM GMT
ఆ హీరోయిన్​ ఇంట్లో వేణుస్వామి పూజలు నిజమే..
X

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడే ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్​మీడియాలో ఆయన వీడియోలు పుల్ వైరల్​ అవుతుంటాయి. గతంలో ఈయన పలువురు హీరోయిన్లతో పూజలు చేయించారు. రష్మిక, నిధి అగర్వాల్​తోపాటు మరికొందరు ఈ లిస్ట్​ ఉన్నారు. అయితే కొన్నినెలల క్రితం హీరోయిన్​ డింపుల్ హయతి ఇంట్లో కూడా వేణుస్వామి పూజలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్​గా మారాయి. సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. కానీ ఆ సమయంలో పూజల కోసం డింపుల్​ ఎక్కడా నోరువిప్పలేదు. తాజాగా డింపుల్​ హయతి ఇంట్లో జరిగిన పూజల వీడియోను వేణుస్వామి తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశారు. వేదమంత్రాల మధ్య డింపుల్​కు వేణుస్వామి ఆశీర్వచనం అందిస్తున్నట్లు కనిపిస్తోంది. శుద్ధజలాన్ని ఆమె తలపై చల్లి సంప్రోక్షణ చేశారు. ఆ సమయంలో ఆమె ఎదుట మలయప్ప స్వామి చిత్రపటాన్ని ఉంచారు. వేణుస్వామి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్​గా మారింది.

అయితే కొన్నినెలల క్రితం డింపుల్ హయతి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని ఓ అపార్ట్‌మెంట్​లో ఉంటున్న ఆమె.. తన బిల్డింగ్​లోకి కొత్తగా వచ్చిన పోలీస్​ అధికారితో వాగ్వాదానికి దిగింది. పార్కింగ్ కోసమే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అప్పుడు ఆ పోలీస్ అధికారి డింపుల్​పై కేసు పెట్టారు. దాన్ని నుంచి ఫ్రీ అయ్యేందుకే వేణుస్వామితో డింపుల్ తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు డింపుల్ ఎక్కడా స్పందించేలేదు.

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన ఈ అమ్మడు.. గల్ఫ్​ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తర్వాత ప్రభుదేవా, తమన్నా కాంబోలో వచ్చిన అభినేత్రి-2లో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆమెకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టింది. మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ మూవీలో సూపర్ హిట్టు అంటూ చెలరేగిపోయి డ్యాన్స్ చేసింది. ఆ ఒక్క పాటతో టాలీవుడ్​లో ఒక్కసారిగా ఫేమస్​ అయిపోయింది.

ఆ తర్వాత మాస్​మహారాజా రవితేజ ఖిలాడీ మూవీతో మళ్లీ హీరోయిన్​గా మొదలుపెట్టింది. ఈ మూవీలో యాక్టింగ్​తో మంచిపేరు కొట్టేసింది. గోపీచంద్​ రామాబాణంలో క్యూట్​నెస్​తో ఆకట్టుకుంది. కానీ ఆ రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఇప్పుడు శంకర్​ దర్శకత్వంలో రామ్​ చరణ్ నటిస్తున్న​ గేమ్​ఛేంజర్​ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అప్పుడు వేణుస్వామి పూజలు ఇప్పుడు డింపుల్​కు కలిసి వస్తాయో లేదో చూడాలి మరి.