Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఖిలాడీ బ్యూటీ గ్లామర్ షో

తాజాగా బ్లాక్ అండ్‌ వైట్‌ సింపుల్‌ అండ్ గ్లామర్ ఔట్ ఫిట్‌ను ధరించింది. చూపు తిప్పుకోనివ్వకుండా హొయలు పోతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   29 April 2025 12:00 AM IST
పిక్‌టాక్‌ : ఖిలాడీ బ్యూటీ గ్లామర్ షో
X

తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా రాణించడం సాధ్యం కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజంగానే తెలుగు మాట్లాడే హీరోయిన్స్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే కొద్ది మంది అమ్మాయిలు మాత్రం ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తీసి పోకుండా అందంగా కనిపించడంతో పాటు, స్కిన్‌ షో చేయడం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంటారు. ఏపీకి చెందిన డింపుల్‌ హయతి టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. రవితేజతో కలిసి 'ఖిలాడీ' సినిమాలో నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. పలు సినిమాల్లో నటించిన డింపుల్‌ తమిళ్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించేందుకు ప్రయత్నించింది.


19 ఏళ్ల వయసులోనే 'గల్ఫ్‌' అనే సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. 2017లో విడుదల అయిన ఆ సినిమా డింపుల్‌కి నటిగా మంచి పేరును తెచ్చి పెట్టింది. 2019లో ఈమె నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా వరుణ్‌ తేజ్ హీరోగా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో చేసిన ఐటెం సాంగ్‌తో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జర్రా జర్రా... అంటూ సాగే ఆ పాటకు మంచి రెస్పాన్స్‌ దక్కింది. దాంతో డింపుల్‌ హయతి కెరీర్ స్పీడ్‌ అందుకుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ఈమె అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.


తాజాగా బ్లాక్ అండ్‌ వైట్‌ సింపుల్‌ అండ్ గ్లామర్ ఔట్ ఫిట్‌ను ధరించింది. చూపు తిప్పుకోనివ్వకుండా హొయలు పోతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. అందమైన ఈ ఖిలాడీ బ్యూటీని ఈ ఫోటోల్లో చూస్తూ ఉంటే గుండె జారి గల్లంతవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో ఖిలాడీ బ్యూటీ గ్లామర్‌ షో చేస్తున్నా కూడా టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. డీ గ్లామర్‌ పాత్రలతో పాటు, గ్లామర్‌ పాత్రలకు రెడీ అంటూ అన్ని రకాలుగా నటించేందుకు సిద్ధ పడే ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.


ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమిళ తండ్రి, తెలుగు తల్లికి 1998లో ఆగస్టు 21న డింపుల్‌ హయతి జన్మించింది. పుట్టడం ఏపీలో అయినా పెరగడం మాత్రం హైదరాబాద్‌లోనే జరిగింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం కొన్ని జాతకాలు, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని తన పేరుకు ముందు హయతిని జత చేసుకుంది. టాలీవుడ్‌లో ఈమెకు చాలా ప్రయత్నాల తర్వాత అవకాశం దక్కింది. మొదటి సినిమా విజయం దక్కించుకోక పోవడంతో ఆఫర్ల కోసం ఎక్కువ రోజులు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఐటెం సాంగ్స్‌కి, వెబ్‌ సిరీస్‌లకు ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తే తమిళనాట ఈ అమ్మడికి వరుస ఆఫర్లు దక్కవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.