Begin typing your search above and press return to search.

దిల్ రాజు.. ఆ బాలీవుడ్ హీరోపైనే స్ట్రాంగ్ ఫోకస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు చాలా సక్సెస్ ఫుల్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 7:30 AM GMT
దిల్ రాజు.. ఆ బాలీవుడ్ హీరోపైనే స్ట్రాంగ్ ఫోకస్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు చాలా సక్సెస్ ఫుల్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఓవైపు నిర్మాతగా, మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా తన సినిమా కెరియర్ ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు మూవీతో నిర్మాతగా తమిళ ఇండస్ట్రీలోకి దిల్ రాజు అడుగు పెట్టారు.

ఇక సోలో నిర్మాతగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం దిల్ రాజు చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీత ఆర్ట్స్ తో కలిపి జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. కానీ ఆశించిన సక్సెస్ అందుకోలేదు. ఈసారి సోలో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాలని దిల్ రాజు ఆలోచిస్తున్నారు. అలాగే స్టార్ హీరో తోనే నిర్మాతగా తన డెబ్యూ సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

రణబీర్ కపూర్ డేట్స్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా మరోసారి రణబీర్ కపూర్ తో మూవీ గురించి చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ పార్క్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.

తరువాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బ్రహ్మాస్త్ర సీక్వెల్ చేయనున్నారు. అయితే దిల్ రాజు మాత్రం వచ్చే ఏడాది అయినా కచ్చితంగా రణబీర్ కపూర్ తో మూవీ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఒక స్టార్ డైరెక్టర్ తో ఈ మూవీ ప్లాన్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ దిల్ రాజు నుంచి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

దిల్ రాజు అంటే ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు గుర్తుకొస్తాయి. మరి బాలీవుడ్ ఎంట్రీ కోసం దిల్ రాజు ఎలాంటి కథను ఎంపిక చేసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రణబీర్ కపూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ల కంటే రొమాంటిక్ లవ్ స్టోరీలు ఎక్కువ చేశారు. యానిమల్ చిత్రంతో మాస్ హీరోగా మారిపోయారు. ఎలాంటి కథ అయినా దానికి తగ్గట్టు క్యారెక్టరైజేషన్ మార్చుకోవడం రణబీర్ గొప్పతనం. మరి దిల్ రాజు అతని కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారనేది వేసి చూడాలి.