Begin typing your search above and press return to search.

ఆ హిందీ సినిమాకు రాజుగారి అండ

షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ డుంకీ. ఈ సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది

By:  Tupaki Desk   |   25 Oct 2023 9:57 AM GMT
ఆ హిందీ సినిమాకు రాజుగారి అండ
X

షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ డుంకీ. ఈ సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని షారుఖ్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు డుంకీతో హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే డుంకీకి ఇప్పుడు సలార్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

డార్లింగ్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న సలార్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. డుంకీ ఒక రోజు ముందుగా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషలలో కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ కి సాలిడ్ సక్సెస్ అయితే ఇప్పటి వరకు రాలేదు.

చేసిన మూడు సినిమాలలో రెండు డిజాస్టర్, సాహో మాత్రం ఎవరేజ్ అయ్యింది. అయితే సలార్ మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో హైఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా సలార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

దీంతో డుంకీ ఎట్టి పరిస్థితిలో సలార్ మూవీని తట్టుకొని నిలబడలేదని అందరూ భావించారు. సలార్ మూవీని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. హిందీ సినిమాలకి నైజాంలో ఎక్కువ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు డుంకీ నైజాం రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. దిల్ రాజు చేతిలో సినిమా పడితే కచ్చితంగా సాలిడ్ గా థియేటర్స్ డుంకీ మూవీకి దొరుకుతాయి. సలార్ సినిమాతో పోటీ పడటానికి ఛాన్స్ దొరుకుతుంది.

రైట్స్ ఏ లెక్కల ప్రకారం దిల్ రాజు దక్కించుకున్నారు అనేది బయటకి తెలియదు కాని అతని చేతుల మీదుగా నైజాంలో రిలీజ్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. సలార్ కంటే ఒక రోజు ముందుగా డుంకీ రిలీజ్ అవుతోంది కాబట్టి ఓపెనింగ్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే డిసెంబర్ 22న సలార్ మూవీ హిట్ అయితే మాత్రం డుంకీ మూవీకి కలెక్షన్స్ పరంగా చాలా ఎఫక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.