Begin typing your search above and press return to search.

5 నెల‌లు న‌న్ను తిట్టుకోకుండా ఓపిక ప‌ట్టండి: దిల్ రాజు

నేడు చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన స‌మావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

By:  Tupaki Desk   |   27 March 2024 5:25 PM GMT
5 నెల‌లు న‌న్ను తిట్టుకోకుండా ఓపిక ప‌ట్టండి: దిల్ రాజు
X

''ఇన్నాళ్లు ఓపిక ప‌ట్టారు.. మ‌రో ఐదు నెల‌లు ఆగండి.. న‌న్ను తిట్టుకోకుండా ఓపిక ప‌ట్టంది!'' అని అన్నారు టాలీవుడ్ అగ్ర‌నిర్మాత దిల్ రాజు. ఆయ‌న ఈ మాట‌లు అన్న‌ది ఎవరితోనో కాదు.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌ను ఆయ‌న పైవిధంగా అభ్య‌ర్థించారు. నేడు చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన స‌మావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

దిల్ రాజు మాట్లాడుతూ-''రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ కాదు.. గ్లోబ‌ల్ స్టార్ అయ్యారు. ఆ రేంజుకు స‌రితూగేలా శంక‌ర్ పాట‌ల్ని, సినిమాని తీర్చిదిద్దుతున్నారు. 2 నెల‌ల్లో గేమ్ ఛేంజ‌ర్ షూట్ పూర్త‌వుతుంది. 4, 5 నెల‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది. ఈరోజు జ‌ర‌గండి పాట‌ను రిలీజ్ చేసాం. 2 ప‌ర్సంట్ మాత్ర‌మే చూపించాం. 98 ప‌ర్సంట్ శంక‌ర్ గారు ఈ పాటను దాచిపెట్టుకున్నారు.. అని తెలిపారు. ఐదు పాట‌ల్ని ఆయ‌న స్టైల్ లో డిజైన్ చేసారు. అభిమానులు సీట్ల‌లో కూచోరు... 3 పాట‌లకు జ‌నం సీట్ల‌లో కూచోల‌రు..

ఇక గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతున్న కొద్దీ త‌న‌ను సోష‌ల్ మీడియాల్లో బాగా తిడుతున్నార‌ని కూడా దిల్ రాజు అన్నారు. ఒరేయ్ దిల్ మామా మాకొక అప్ డేట్ ఇవ్వు అని అడుగుతున్నారు. కానీ దిల్ మామ అప్ డేట్ ఇవ్వ‌లేడు. శాటిలైట్ నుంచి శంక‌ర్ గారు ఇది ఇవ్వు అంటేనే ఇవ్వ‌గ‌ల‌ను.. 5నెల‌లు ఓపిక ప‌డితే గేమ్ ఛేంజ‌ర్ మీ ముందుకు వ‌చ్చేస్తుంది'' అని అన్నారు.

చ‌ర‌ణ్ తిరుమ‌ల ద‌ర్శ‌నం చేసుకుని వ‌చ్చారు.. పాట జోరుగా వెళ్లింది జ‌నంల‌కి.. .మేం లిరిక‌ల్ వీడియోలో వంద‌శాతం సంతృప్తి ప‌ర‌చ‌లేం. 100 శాతం ఈ పాట‌కు సీట్ల‌లో కూర్చోరు.. అని కూడా దిల్ రాజు అన్నారు. ఈ సినిమా నుంచి మూడు పాట‌లు ప్ర‌త్యేకించి హైలైట్ గా నిలుస్తాయ‌ని కూడా తెలిపారు.