Begin typing your search above and press return to search.

దిల్ రాజు లో ఈ టాలెంట్ కూడా ఉందా?

అది సినిమాలో కూడా ఉంది అంటే నమ్ముతారా.. స్టేజ్‌ పై ఎక్కువ సమయం మాట్లాడేందుకే సిగ్గు పడే దిల్ రాజు ఏకంగా పాట పాడాడు

By:  Tupaki Desk   |   7 Dec 2023 2:30 PM GMT
దిల్ రాజు లో ఈ టాలెంట్ కూడా ఉందా?
X

టాలీవుడ్‌ దిగ్గజ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన బ్యానర్‌ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఒక కథ వర్కౌట్‌ అవుతుందా, ఏ హీరోతో ఎంత బడ్జెట్‌ లో సినిమాను తీయాలి అనేది దిల్‌ రాజుకు తెల్సినంత ఎవరికి తెలియదని చాలా మంది అంటూ ఉంటారు.

దిల్ రాజులో ఒక నిర్మాత మాత్రమే కాకుండా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ మంచి సంగీత అభిరుచి కలిగిన సంగీత దర్శకుడు కూడా ఉంటాడు అంటూ ఆయనతో వర్క్‌ చేసిన వారు అంటుంటారు. అలాంటి దిల్ రాజు ఒక పాట పాడాడు. అది సినిమాలో కూడా ఉంది అంటే నమ్ముతారా.. స్టేజ్‌ పై ఎక్కువ సమయం మాట్లాడేందుకే సిగ్గు పడే దిల్ రాజు ఏకంగా పాట పాడాడు.

నాగ చైతన్య హీరోగా జోష్ సినిమాతో పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో జేడీ చక్రవర్తి గురించిన ఒక పాట ఉంటుంది. ఆ పాటను దిల్ రాజు ఆలపించాడు. దిల్ రాజు పాట పాడి చాలా రోజులు అయింది.. ఆ సినిమా వచ్చి కూడా చాలా ఏళ్లు అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు ఆ వీడియోను షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది.

దిల్‌ రాజు లో ఈ యాంగిల్‌ మీరు చూశారా అంటూ కొందరు హడావుడి చేస్తున్నారు. రాఘవేంద్ర రావు టాక్ షో లో దిల్‌ రాజు పాల్గొన్న సమయంలో జోష్‌ లో ఎందుకు ఆ పాట పాడాల్సి వచ్చిందనే విషయం పై స్పందించాడు. విచిత్రం ఏంటి అంటే జోష్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఆ పాట గురించి ఇప్పటికి కూడా చర్చ జరగడం.