Begin typing your search above and press return to search.

TFCC ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ విజయం

By:  Tupaki Desk   |   30 July 2023 8:32 PM IST
TFCC ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ విజయం
X

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఈరోజు జరిగాయి. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. దిల్ రాజు ప్యానెల్ ఎన్నికలలో మంచి సంఖ్యలను సంపాదించి రేసులో గెలుపొందింది.

మొత్తం 891 ఓట్లకు గాను, దిల్ రాజు ప్యానెల్ 563 ఓట్లను సాధించగా సి కళ్యాణ్ ప్యానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి. దిల్ రాజు ప్యానెల్ నిర్మాతల విభాగంలో 12కి 7 విజయాలు ద‌క్కించుకోగా.. స్టూడియో విభాగంలో 4కి 3 విజయాలు సాధించింది. పంపిణీ రంగంలో పోరాటం కఠినంగా ఉంద‌ని తెలిసింది. పంపిణీదారుల్లో ఇరు ప్యానెళ్ల‌ నుండి ఆరుగురు సభ్యులు రేసులో గెలిచారని స‌మాచారం.

టీఎఫ్‌సీసీని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పోటీ చేశానని దిల్ రాజు ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించారు. చిన్న సినిమాల‌కు అండ‌గా ఉంటాన‌ని ప‌రిశ్ర‌మను మ‌రో స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ప‌దవి కోసం తాను ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం లేద‌ని స్ప‌ష్ఠం చేసారు. ఇక దిల్ రాజు ఎన్నిక ముందే ఊహించిన‌దే. చివ‌రికి ఇప్పుడు స్ప‌ష్ఠంగా ఆయ‌న గెలుపొందారు. 2023-25 సీజ‌న్ కి ఛాంబ‌ర్ కొత్త అధ్య‌క్షుడిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌డ‌తారు.