Begin typing your search above and press return to search.

దిల్ రాజు 'సంక్రాంతి' ముచ్చట...!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అత్యంత కీలకమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   22 March 2024 5:31 AM GMT
దిల్ రాజు సంక్రాంతి ముచ్చట...!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అత్యంత కీలకమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సంక్రాంతికి కూడా పెద్ద హీరోల సినిమాలు కనీసం రెండు మరియు చిన్న సినిమాలు కూడా విడుదల అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. 2024 సంక్రాంతికి ఏ స్థాయిలో పోటీ నెలకొందో మనం చూశాం.

2025 సంక్రాంతికి సంబంధించిన బెర్త్‌ లు కూడా అప్పుడే ఖరారు అవుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా తో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తాను అంటూ ప్రకటించాడు. నాని సినిమా కూడా వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు మూడు సంక్రాంతి వరకు ఫిక్స్ అయినా ఆశ్చర్యం లేదు.

ఇలాంటి సమయంలో దిల్‌ రాజు కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దిల్‌ రాజు ఇప్పటి వరకు సంక్రాంతికి ఎన్నో సొంత సినిమాలను మరియు డిస్ట్రిబ్యూషన్‌ సినిమాలను తీసుకు వచ్చాడు. మెజారిటీ శాతం ఆయనకు లాభాలను తెచ్చి పెట్టాయి.

ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. టైటిల్‌ లోనే సంక్రాంతి ఉంది.. కనుక డౌట్ లేకుండా ఆ సినిమా సంక్రాంతికే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇంతకు దిల్ రాజు రిజిస్ట్రర్ చేయించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరో ఎవరై ఉంటారు... దర్శకత్వం ఎవరు చేస్తారు అనే ముచ్చట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతున్నాయి. దిల్ రాజు నుంచి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.