Begin typing your search above and press return to search.

దిల్ రాజు ఇంట సైలెంట్ గా యువ‌హీరో నిశ్చితార్థం..

టాలీవుడ్ లో వ‌రుస పెళ్లిళ్లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇటీవలే వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట ప్రేమ వివాహం ట్రెండింగ్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 3:40 AM GMT
దిల్ రాజు ఇంట సైలెంట్ గా యువ‌హీరో నిశ్చితార్థం..
X

టాలీవుడ్ లో వ‌రుస పెళ్లిళ్లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇటీవలే వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట ప్రేమ వివాహం ట్రెండింగ్ గా నిలిచింది. ఇంత‌లోనే విక్ట‌రీ వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం వార్త‌లు కూడా వెలువ‌డ్డాయి. తాజాగా టాలీవుడ్ లో మరో పెళ్లి జరగబోతుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయని స‌మాచారం.


దిల్ రాజు సోద‌రుని కుమారుడు ఆశిష్ రెడ్డికి అద్వితారెడ్డితో ఈరోజు నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు అక్టోబర్‌లో ఇరు కుటుంబాల స‌మక్షంలో మ్యాచ్ ఫిక్సింగ్ వేడుక జరిగింది. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి ఇది. దిల్ రాజు నివాసంలో పెద్దగా హంగామా లేకుండా సంప్రదాయబద్ధమైన ఫంక్షన్ జరిగింది. 14 ఫిబ్రవరి 2024న జైపూర్‌లో ఈ వివాహం జరగనుంది. ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్, సెల్ఫిష్ చిత్రాల్లో నటించారు. న‌టుడిగా కొన‌సాగ‌నున్నారు.

ఆశిష్ ఎవ‌రు?

టాలీవుడ్ అగ్ర‌నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ చాలా కాలంగా సినీనిర్మాణ రంగంలోకి వచ్చి దిల్ రాజుతో కలిసి పనిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి. రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా రంగ ప్ర‌వేశం చేసాడు. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో రానున్నాడు. మూడో సినిమాని కూడా ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఆశిష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు అద్విత రెడ్డిని పెళ్లాడుతున్నారు. ఈ జంట‌ నిశ్చితార్థానికి చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజ‌నులు ఈ అంద‌మైన జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.