Begin typing your search above and press return to search.

దిల్‌ రాజు అరబిక్ కుత్తు వైరల్‌

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల వివాహ వేడుకల్లో సంగీత్ కార్యక్రమం వీడియోలు వైరల్‌ అవ్వడం కామన్ అయ్యింది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 10:36 AM GMT
దిల్‌ రాజు అరబిక్ కుత్తు వైరల్‌
X

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల వివాహ వేడుకల్లో సంగీత్ కార్యక్రమం వీడియోలు వైరల్‌ అవ్వడం కామన్ అయ్యింది. ఎప్పుడూ డాన్స్ లు చేయని వారు డాన్స్ చేయడం, పాటలు పాడని వారు పాటలు పాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఆశిష్ వివాహం లో దిల్ రాజు డాన్స్ గురించి చర్చ జరిగింది.


తాజాగా దిల్ రాజు డాన్స్ వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. విజయ్ సూపర్ హిట్‌ సాంగ్ అరబిక్ కుత్తు కి దిల్‌ రాజు వేసిన డాన్స్ కు అంతా ఫిదా అవుతున్నారు. అత్యంత వైభవంగా జైపూర్ లోని ప్యాలెస్‌ లో జరిగిన వివాహ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

సినిమా వేడుకల్లో గతంలో దిల్‌ రాజు డాన్స్ వేయడం చూశాం. ఇప్పుడు సోదరుడి తనయుడి పెళ్లి వేడుకలో డాన్స్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఎప్పటికప్పుడు తన డాన్స్ మరియు స్పీచ్‌ లతో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే దిల్‌ రాజు ఈసారి అరబిక్ కుత్తు పాట డాన్స్ తో వైరల్‌ అయ్యాడు.

ఇక దిల్‌ రాజు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్‌ చరణ్ శంకర్‌ కాంబోలో గేమ్ చేంజర్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా చిన్నా పెద్ద సినిమాలు కలిపి దాదాపుగా పది సినిమాలను దిల్‌ రాజు కాంపౌండ్ వారు నిర్మిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నా కూడా దిల్‌ రాజు పార్టీ ల్లో సరదాగా డాన్స్ లు చేయడం మనం చూస్తూ ఉంటాం.