Begin typing your search above and press return to search.

పెళ్లిలో రాజు గారి డాన్స్ వైరల్‌

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు అయిన శిరీష్ తనయుడు ఆశిష్ వివాహం అద్వైత రెడ్డితో తాజాగా జైపూర్ లోని ప్యాలెస్ లో వైభవంగా జరిగింది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:42 AM GMT
పెళ్లిలో రాజు గారి డాన్స్ వైరల్‌
X

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు అయిన శిరీష్ తనయుడు ఆశిష్ వివాహం అద్వైత రెడ్డితో తాజాగా జైపూర్ లోని ప్యాలెస్ లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి తో పాటు ఇంకా ఇండస్ట్రీ నుంచి పలువురు హాజరు అయ్యారు.


పెళ్లిలో దిల్ రాజు చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన తమ్ముడి తనయుడు అయినా కూడా ఆశిష్ ని తన వారసుడిగానే ఇండస్ట్రీకి దిల్‌ రాజు పరిచయం చేసిన విషయం తెల్సిందే. ఆశిష్ పెళ్లి ఆహ్వాన పత్రికలు ఇవ్వడం మొదలుకుని దాదాపు అన్ని విషయాల్లో దిల్ రాజు ముందు ఉండి నడిపించాడు.

ఇక పెళ్లిలో కూడా స్పెషల్ గా కనిపించే విధంగా డ్రెస్ వేసుకోవడంతో పాటు మెడలో డప్పు వేసుకుని కొడుతూ డాన్స్ చేయడంతో పాటు, తన మనుమరాలితో కూడా దిల్‌ రాజు తెగ సందడి చేశాడు. దిల్ రాజు డాన్స్ వీడియోలు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

రాజు గారు తాత అయిన తర్వాత కూడా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా డాన్స్ లు వేస్తున్నాడు అంటూ చాలా మంది ఈ వీడియోలను షేర్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆశిష్ హీరోగా పరిచయం అయ్యాడు. రౌడీ బాయ్స్ తో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.