Begin typing your search above and press return to search.

దిల్ రాజు.. బ్రాండ్ తోనే కొడుతున్నాడు!

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   1 April 2024 4:19 AM GMT
దిల్ రాజు.. బ్రాండ్ తోనే కొడుతున్నాడు!
X

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిర్మాతలు ఎప్పుడు కూడా సినిమా ప్రమోషన్స్ లో వెనకే ఉంటారు. డబ్బులు పెట్టడం తప్ప కెమెరా ముందుకొచ్చి మాట్లాడింది చాలా తక్కువ. అలాగే నిర్మాతలకి సెలబ్రెటీ స్టేటస్ కూడా పెద్దగా ఉండదు. ఫ్యానిజం కూడా ఉండదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యానిజం కలిగి సెలబ్రెటీ ఇమేజ్ ఉన్న ఒకే ఒక్క ప్రొడ్యూసర్ దిల్ రాజు అని చెప్పాలి.

దీనికి కారణం దిల్ రాజు నిర్మించి ప్రతి సినిమాకి యాక్టర్స్, టెక్నీషియన్స్ తో పాటు నిర్మాతగా తాను కూడా ముందుండి ప్రమోషన్ చేయడమే. సినిమాని మార్కెట్ లోకి తీసుకొని వెళ్లడంలో దిల్ రాజు తనదైన భూమిక పోషిస్తాడు. డిస్టిబ్యూటర్స్ గా ఉన్నా కూడా ఆ సినిమాల ప్రమోషన్స్ లో దిల్ రాజు భాగం అవుతూ ఉంటాడు. అందుకే నిర్మాతగా దిల్ రాజుకి ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానితోనే ఇండస్ట్రీలో కొన్ని బలమైన హిట్స్ కొడుతున్నాడు అని చెప్పవచ్చు.

ఆయన ప్రొడక్షన్ నుంచి మూవీ వస్తుంది అంటేనే ఫస్ట్ డే ఓపెనింగ్స్ సాలిడ్ గా వస్తాయనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. ఎంత టైట్ షెడ్యూల్ లో ఉన్న కూడా రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో దిల్ రాజు విస్తృతంగా పాల్గొంటూ ఉంటాడు. ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాని ప్రమోషన్స్ లో దిల్ రాజు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. తమిళనాడు కూడా వెళ్లి ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.

వారిసు రిలీజ్ సమయంలో జరిగిన ఈవెంట్ లో తమిళంలో తాను ఉపయోగించిన కామెంట్స్ విస్తృతంగా వైరల్ అయ్యాయి. ట్రోలింగ్ అయిన కూడా పాజిటివ్ గా తీసుకొని ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో మళ్ళీ ఆ డైలాగ్స్ ని ఉపయోగించారు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఓ చోట ముగించుకొని వెంటనే ఆశిష్, వైష్ణవి జోడీగా తెరకెక్కిన లవ్ మీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు పార్టిసిపేట్ చేశాడు.

ఆ ఈవెంట్ లో సాంగ్ లిరిక్స్ ని హమ్ చేయడమే కాకుండా వైష్ణవితో దిల్ రాజు దగ్గరుండి పాడించారు. ఈవెంట్ లో దిల్ రాజు ఎనర్జీ లెవల్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఊరకనే దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ కాలేదని, తన సినిమాని మార్కెట్ లోకి తీసుకెళ్లడంలో ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రతి విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటాడు కాబట్టి ప్రస్తుతం నెంబర్ వన్ నిర్మాతగా టాలీవుడ్ లో నిలబడ్డాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.