Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఫైట్.. నిజంగా దిల్ రాజు వెనక్కి తగ్గుతారా?

ఇక మళ్ళీ ఇంతకాలం తర్వాత ఇద్దరు దిల్ రాజు ప్రొడక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామని ఇది వరకే దిల్ రాజు తెలియజేశారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 12:30 PM GMT
సంక్రాంతి ఫైట్.. నిజంగా దిల్ రాజు వెనక్కి తగ్గుతారా?
X

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి రాబోతున్న సినిమాలలో ఫ్యామిలీ స్టార్ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్ టీజర్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇదివరకే విజయ్ పరుశురాం ఇద్దరు కూడా గీతగోవిందం సక్సెస్ తో బెస్ట్ కాంబినేషన్ గా నిరూపించుకున్నారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక మళ్ళీ ఇంతకాలం తర్వాత ఇద్దరు దిల్ రాజు ప్రొడక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామని ఇది వరకే దిల్ రాజు తెలియజేశారు. ఎందుకంటే ఈ సినిమా ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఫెస్టివల్ సీజన్లో ఆడియన్స్ మెప్పు పొందుతుంది అని దిల్ రాజు నమ్మకంతో ఉన్నారు.

పైగా దర్శకుడు పరశురామ్ ఫ్యామిలీ కథలను చాలా బాగా తెర పైకి తీసుకు రాగలరని చాలా సార్లు రుజువైంది. సంక్రాంతి టైమ్ లో ఫ్యామిలీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చట.

దిల్ రాజు ఈ సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే స్టార్ట్ చేసినప్పటికీ అవుట్ డోర్ షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవచ్చని టాక్. విదేశాల్లో కూడా కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయాలని అనుకున్నారు. కానీ వీసా అప్రూవల్ ఆలస్యం కావడం కూడా మరొక రీజన్ అని తెలుస్తోంది.

మొత్తంగా సినిమా షూటింగ్ వల్లనే ఈ సినిమాను సంక్రాంతి నుంచి తప్పించే అవకాశం ఉందట. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాను సమ్మర్ లో విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ విజయ్ దేవరకొండకు జోడిగా నటిస్తోంది. ఇక విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ కూడా క్లిక్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.