Begin typing your search above and press return to search.

దిల్ రాజు డ్రీం ప్రాజెక్ట్.. ఎలా ఉంటుందో?

టాలీవుడ్ బడా నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న వ్యక్తి దిల్ రాజు.

By:  Tupaki Desk   |   31 March 2024 10:58 AM GMT
దిల్ రాజు డ్రీం ప్రాజెక్ట్.. ఎలా ఉంటుందో?
X

టాలీవుడ్ బడా నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న వ్యక్తి దిల్ రాజు. ఓ వైపు నిర్మాతగా మరో వైపు డిస్టిబ్యూటర్ గా సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. టిల్లు స్క్వేర్ తో డిస్టిబ్యూటర్ గా నైజాం ఏరియాలో దిల్ రాజు భారీ లాభాలు అందుకోబోతున్నారు. మరో వైపు ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో మూవీ రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. హీరో, హీరోయిన్స్ తో పాటుగా నిర్మాత దిల్ రాజు కూడా తన ప్రతి సినిమా ప్రమోషన్స్ లో కచ్చితంగా పాల్గొంటారు. అలాగే ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్ ని దగ్గరుండి దిల్ రాజు చూసుకుంటున్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో దిల్ రాజు తన డ్రీం ప్రాజెక్ట్ గురించి చెప్పారు. నాలుగేళ్లలో భారీ బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నట్లు దిల్ రాజు చెప్పాడు. అయితే ఎలాంటి కథతో సినిమా చేయాలనేది మాత్రం దిల్ రాజు చెప్పలేదు. అయితే గతంలో దిల్ రాజు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అలాగే లిస్టులో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా అన్నారు.

భవిష్యత్తులో వీరితో సినిమాలు చేయాలి అని ఇదివరకే ఒక మాట కూడా తీసుకున్నారు. ఇక కథల విషయానికి వస్తే సోషియో ఫాంటసీ నుంచి ఫాంటసీ థ్రిల్లర్ ప్లస్ యాక్షన్ లాంటి కథలను ఇదివరకే విన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి లాంటి సినిమాలు చేయాలని ఉందని కూడా దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. మరి ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా ఎలాంటి కాంబినేషన్ తెరపైకి వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

మరోవైపు హర్షిత్ రెడ్డి, హన్షిత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్త వారితో సినిమాలు చేస్తున్నారు. భిన్నమైన కథలతో వచ్చే కొత్త దర్శకులకి ఆ బ్యానర్ లో అవకాశం కల్పించి ప్రోత్సహిస్తున్నారు. నిర్మాతగా నా ప్రయాణం మొదలై 21 ఏళ్ళు అవుతుంది. ఈ నాలుగేళ్లలో భారీ పాన్ ఇండియా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాను. దానికి సంబందించిన గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోంది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలాగే తన బ్యానర్ లో వచ్చిన ఆర్య మూవీ మే 7 నాటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. దీనికి సంబంధించి రీయూనియన్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం.

ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మాగ్జిమమ్ కన్ఫర్మ్ అయ్యింది. డైరెక్టర్ శంకర్ నుంచి కన్ఫర్మేషన్ రాగానే ఎనౌన్స్ చేస్తాం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ మూవీ రాబోతుంది. దీని తర్వాత లవ్ మీ సినిమాని రిలీజ్ చేయబోతున్నామని దిల్ రాజు స్పష్టం చేశారు.