రాజుగురు ఇక రిస్క్ లు తీసుకోరా?
కోలీవుడ్ సంచలనం శంకర్ తో సినిమా తీయడం అన్నది దిల్ రాజు డ్రీమ్. ఆ డ్రీమ్ `గేమ్ ఛేంజర్` తో నెరవేరింది.
By: Tupaki Desk | 25 April 2025 12:30 AMకోలీవుడ్ సంచలనం శంకర్ తో సినిమా తీయడం అన్నది దిల్ రాజు డ్రీమ్. ఆ డ్రీమ్ `గేమ్ ఛేంజర్` తో నెరవేరింది. మంచో ...చెడో శంకర్ తో సినిమా తీయాలనుకున్నారు తీసారు. ఆ సినిమా ఫలితం రాజుగారుకి గొప్ప అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా ప్లాప్ తో రాజుగారు భారీగా నష్టాలు చూసారు అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. దీంతో ఈ సినిమా ఫలితం ఓ గుణపాఠం లాంటిందని రాజుగారే అన్నారు.
నిజానికి ఈ సినిమా విషయంలో రాజుగారు తనని తానే త్యాగం చేసుకున్నారు. ఎందుకంటే? సాధారణంగా దిల్ రాజు ఏ సినిమా నిర్మాణం చేపట్టినా? స్టోరీ విషయంలో రాజుగారి ఇన్వాల్వ్ మెంట్ అన్నది చాలా బలంగా ఉంటుంది. ఆయన అనుభవంతో దర్శక, రచయితలకు కొన్ని సలహాలు...సూచనలు ఇస్తుం టారు. ఆ ప్రకారం రైటర్లు కూడా ఆయన విజన్ ని సైతం కథలో పొందుపర్చుతారు. `గేమ్ ఛేంజర్` ముందు వరకూ రాజుగారు ఇదే వేవ్ లో సినిమాలు చేసారు.
సక్సెస్ లు అలాగే అందుకున్నారు. అలా ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు. తప్పిన సందర్భాలు చాలా తక్కువ. కానీ `గేమ్ చేంజర్` విషయంలో రాజుగారు కేవలం పెట్టుబడి పెట్టే నిర్మాత మాత్రమే. కథ విషయంలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ లేదు. శంకర్ పెద్ద డైరెక్టర్ కాబట్టి ఆయనకి సలహాలు ఇవ్వాలని రాజుగారు కూడా ఏ రోజు అనుకోలేదు. పూర్తిగా శంకర్ చేతుల్లోనే వదిలేసారు.
`గేమ్ ఛేంజర్` అనుభవం నేపథ్యంలో రాజుగారు మళ్లీ ఇలాంటి రిస్క్ లు తీసుకోరని తెలుస్తోంది. తన పాత పద్దతిలోనే సినిమాలు చేయాలని బలంగా ముందుకెళ్తున్నారు. రూపాయి పెడితే రెండు రూపాయలు లాభం వచ్చే పనులు మాత్రమే చేయాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం రాజుగారు నిర్మాణం లో కొన్ని సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ ల విషయంలోనూ చురుకుగా పావులు కదుపు తున్నారు. ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ రైటర్లు...నటీనటుల్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.