Begin typing your search above and press return to search.

నవ్వు ఆపుకోలేక పోయిన దిల్‌ రాజు భార్య

అందులో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. దిల్‌ రాజు మాట్లాడుతున్న సమయంలో ఒక విషయం చెప్పగా ఆయన భార్య తేజస్విని పడి పడి నవ్వుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 5:48 AM
నవ్వు ఆపుకోలేక పోయిన దిల్‌ రాజు భార్య
X

దిల్‌ రాజు ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లోనూ దిల్‌ రాజు సినిమాలను నిర్మించిన విషయం తెల్సిందే. నిర్మాతగా స్టార్‌ హీరోలతో, సూపర్‌ స్టార్స్‌తో సినిమాలను నిర్మించిన దిల్‌ రాజు చిన్న హీరోలు, అంతా కొత్త వారితో కోటి.. రెండు కోట్ల సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. కొత్త వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో తన వారసులతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభింపజేశాడు. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలను నిర్మించిన దిల్‌ రాజు కొత్తగా దిల్‌ రాజు డ్రీమ్స్ అంటూ ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా ఆ సంస్థ ప్రారంభోత్సవం జరిగింది.

సంస్థ ప్రారంభోత్సవంకు రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. దేవి శ్రీ ప్రసాద్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అందులో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. దిల్‌ రాజు మాట్లాడుతున్న సమయంలో ఒక విషయం చెప్పగా ఆయన భార్య తేజస్విని పడి పడి నవ్వుతున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. దిల్‌ రాజు ఇండస్ట్రీలో పరిస్థితులను గురించి వివరించిన సమయంలో చాలా ఏళ్ల క్రితం తాము మోస పోయిన విషయం గురించి చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్‌గా మేము ఎంట్రీ ఇచ్చాం. శిరీష్‌, లక్ష్మణ్‌లతో కలిసి ఒక సినిమాను కొనుగోలు చేశాం.

సినిమాను షూటింగ్‌ ప్రారంభం కాకుండానే కొనుగోలు చేశాం. ఆ సమయంలో వారు సినిమాను మీరు ఎలాగూ కొన్నారు.. మీరు చూడ్డానికి బాగున్నారు ఇందులో ఒక పాత్ర ఉంది చేయాలంటూ అడిగారు. మొదట అనుమానంగానే సరే అన్నాను. షూటింగ్‌ ప్రారంభం రోజు వెళ్లాము. మా ముగ్గురికి హోర్డింగ్‌లు పెట్టడంతో షాక్‌ అయ్యాము. షూటింగ్‌ ప్రారంభం అయింది, మధ్యాహ్నం తర్వాత నాకు మేకప్ వేశారు. సాయంత్రంకు నన్ను షాట్‌ కు పిలిచారు. ఒక అమ్మాయితో కలిపి గంట కొట్టించారు. అప్పుడే అర్థం అయింది ఇది వర్కౌట్‌ అయ్యేది కాదు. వీళ్లు మనకు సోప్‌ వేశారు అని తెలిసింది అంటూ అప్పుడు ఎలా మోస పోయారు అనే విషయాన్ని చెబుతున్న సమయంలో దిల్‌ రాజు భార్య తేజస్విని నవ్వు ఆపుకోలేక పోయారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకునే వారు ఇలాంటి మోసాలకు గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండకుంటే మొదటికే మోసం వస్తుంది. మేము కొన్ని డబ్బులు వారికి ఇచ్చాం. ఆ డబ్బును వదిలేసి కొత్త జర్నీ స్టార్‌ చేయకుండా ఉంటే మేము అక్కడే ఆగిపోయేవాళ్లం అని దిల్‌ రాజు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకునే వారు జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో దిల్‌ రాజు తన అనుభవంను చెప్పుకొచ్చాడు. నటించే అవకాశం ఇస్తామంటూ మోసం చేసి, డబ్బులు వసూళ్లు చేసే వారు ఉంటారు అనే ఉద్దేశం వచ్చేలా దిల్‌ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో దిల్‌ రాజు, ఆయన భార్య ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఈ వీడియో సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే వైరల్‌ అయింది.