ముందు గొయ్యి..వెనుక నుయ్యి అన్నట్లే పరిస్థితి!
పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్-పాకిస్తాన్ నటి హనియా అమర్ నటించిన `సర్దార్ జీ 3` ఇప్పటికే వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Jun 2025 4:00 PM ISTపంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్-పాకిస్తాన్ నటి హనియా అమర్ నటించిన `సర్దార్ జీ 3` ఇప్పటికే వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారత్ లో విడుదల కాలేదు. కానీ పాకిస్తాన్ లో మాత్రం విడుదలైంది. దిల్జీత్ స్వయంగా నిర్మించిన చిత్రం పాకిస్తాన్ లో రిలీజ్ చేయడంపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యకమైంది. ఈ చిత్రాన్ని ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ దేశ ద్రోహంతో సమానంగా పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఇండియాలో ఈసినిమా రిలీజ్ అవ్వడం కష్టమని తేలిపోయింది. అయితే ఇప్పుడీ ప్రభావం `బోర్డర్ 2`పై పడుతుంది. భారత సైనికులు త్యాగాల అంశాలతోనే బోర్డర్ 2 తెరకెక్కుతోంది. ఇందులోనూ దిల్జీత్ నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి దిల్జీత్ ని తొలగించాలని డిమాండ్ల పర్వ మొదలైంది. ఇదే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ కూడా డిమాండ్ చేస్తోంది.
జాతీయ సమగ్రతను కాపాడుటానికి, దేశభక్తిగల భారతీయుల మనోభావాలను గౌరవించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఓ లేఖను కూడా రిలీజ్ చేసారు. ఆర్మీ అధికారి పాత్ర పోషిస్తున్న దిల్జీత్ ని తొలగిం చాలని డిమాండ్ చేసింది. అయితే చిత్ర సన్నిహిత వర్గాలు మాత్రం దిల్జీత్ ని తొలగించేది లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందని...మధ్యలో ఎలా తీసేస్తామంటున్నారు.
ఇందులో నటీనటుల వివరాలు ఎలాంటి గొడవలు లేని సమయంలోనే ఓ లిస్ట్ రూపంలో రిలీజ్ చేసామని పేర్కొన్నారు. దీంతో సంఘాలు కూడా అంతే సీరియస్ గా ఉన్నాయి. షూటింగ్ ఎలా పూర్తి చేసి రిలీజ్ చేస్తారో చూస్తామంటూ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ డైలమాలో పడుతున్నారు. ముందుకెళ్తే నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారింది. తీరా పూర్తి చేసి రిలీజ్ కు వచ్చే సరికి సినిమాపై నిషేధం..బోయ్ కాట్ ట్రెండ్ తెరపైకి తెస్తే పరిస్థితి ఏంటి? అన్నది అర్దం కానీ పరిస్థితిలో ఉన్నారు.
