Begin typing your search above and press return to search.

బోర్డ‌ర్2లో జాయిన్ అయిన మ‌రో ప్ర‌ముఖ న‌టుడు

బార్డ‌ర్2 సినిమా క్యాస్టింగ్ లో ఇప్పుడు దిల్జిత్ దోసాంజ్ కూడా జాయిన్ అవ‌డంతో సినిమా మ‌రింత పెద్ద‌దిగా మారింది.

By:  Tupaki Desk   |   30 May 2025 11:30 AM
బోర్డ‌ర్2లో జాయిన్ అయిన మ‌రో ప్ర‌ముఖ న‌టుడు
X

బార్డ‌ర్2 సినిమా క్యాస్టింగ్ లో ఇప్పుడు దిల్జిత్ దోసాంజ్ కూడా జాయిన్ అవ‌డంతో సినిమా మ‌రింత పెద్ద‌దిగా మారింది. ఇండియ‌న్ సినిమాలోనే అతి పెద్ద వార్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమాలో స‌న్నీ డియోల్, వ‌రుణ్ ధావ‌ణ్, అహాన్ శెట్టి న‌టించ‌నున్నార‌ని మేక‌ర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేయ‌గా, ఇప్పుడు ఆ లిస్ట్ లోకి దిల్జిత్ దోసాంజ్ కూడా జాయిన్ అయ్యారు.

అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ సినిమా షూటింగ్ జూన్ 10 నుంచి మొద‌లు కానుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో దిల్జిత్ దోసాంజ్ చాలా ఇంట్రెస్టింగ్ పాత్రలో న‌టించ‌నున్నారు. 1971 కాలంలో ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన వార్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. జూన్ 10 నుంచి మొద‌లుకానున్న షూటింగ్ లో దిల్జిత్ జాయిన్ కానున్నారు.

మొద‌టి షెడ్యూల్ లో భాగంగా అనురాగ్ సింగ్, స‌న్నీ డియోల్ పై స‌న్నివేశాల‌ను షూట్ చేయ‌నున్నాడ‌ట‌. ఆగ‌స్ట్ 10 నాటికి బోర్డ‌ర్2 షూటింగ్ ను పూర్తి చేసి 2026 రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. దిల్జిత్ దోసాంజ్ సింగ‌ర్ గానే కాకుండా యాక్ట‌ర్ గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకుని త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. రీసెంట్ గా దిల్జిత్ మెట్‌గాలా 2025లో పాల్గొని అత‌ని రెడ్ కార్పెట్ వాక్ తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే.

2024లో చివరిగా జాట్, జూలియ‌ట్3 లో క‌నిపించినప్ప‌టి నుంచి అంద‌రూ మ‌ళ్లీ అత‌న్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అలా అని ఇప్పుడు బోర్డ‌ర్2 బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ఆ క్రెడిట్ మొత్తం దిల్జిత్‌కే వ‌స్తుంద‌ని చెప్ప‌లేం. ఎన్నో ఏళ్ల కింద‌ట రిలీజైన బోర్డర్ సినిమాను జె.పి ద‌త్తా ఎంతో బాగా తెర‌కెక్కించి మంచి హిట్ అందుకున్నారు.

ఇప్పుడు బోర్డ‌ర్2 సినిమాకు అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆరేళ్ల కింద‌ట వ‌చ్చిన కేస‌రి సినిమాతో మంచి హిట్ అందుకున్న అనురాగ్ పై ఇప్పుడు బోర్డ‌ర్2 సినిమా రూపంలో చాలా పెద్ద బాధ్య‌తే ఉంది. బార్డ‌ర్ సినిమా రేంజ్ ను పెంచేలా ఈ సినిమాను రూపొందించ‌డంతో పాటూ సినిమాలోని అన్ని పాత్ర‌ల‌ను ఎంతో గొప్ప‌గా ప్రెజెంట్ చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. మ‌రి బోర్డ‌ర్2, ముందు సినిమా రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలంటే కొంత కాలం పాటూ ఆగాల్సిందే.