Begin typing your search above and press return to search.

'దిల్ రాజు డ్రీమ్స్ అంటే నైజాం నవాబ్ అవ్వడమా?'.. డిస్ట్రిబ్యూటర్ ఫుల్ ఫైర్

ఇప్పుడు దిల్ రాజు ప్రెస్ మీట్ తో పాటు ప్రెస్ నోట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ స్పందించారు.

By:  Tupaki Desk   |   28 May 2025 5:26 PM IST
దిల్ రాజు డ్రీమ్స్ అంటే నైజాం నవాబ్ అవ్వడమా?.. డిస్ట్రిబ్యూటర్ ఫుల్ ఫైర్
X

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ నలుగురు.. ఆ నలుగురు అంటున్నారని, కానీ తన వద్ద తక్కువ థియేటర్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఎగ్జిబిటర్ల సమస్యలపై తామంతా చర్చించామని, సమస్యకు ఒక పరిష్కారం చూడాలని అనుకున్నామని దిల్ రాజు తెలిపారు.

తమ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌ చేస్తామని అన్నారని, తాను వద్దని వారించానని తెలిపారు. నెక్స్ట్ మీటింగ్ లో తమ డిమాండ్‌లు నెరవేరకుంటే థియేటర్లు బంద్‌ చేస్తామని మాత్రమే అన్నారని చెప్పారు. ఈస్ట్ గోదావరిలో ఓ వ్యక్తితో మొదలైన తెలంగాణకు ఆపాదించారని ఆరోపించారు.

ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్స్ తో పాటు తినుబండారాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు స్వాగతిస్తున్నట్లు నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దిల్ రాజు ప్రెస్ మీట్ తో పాటు ప్రెస్ నోట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ స్పందించారు. వివిధ విమర్శలు చేస్తూ ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు.

"పవన్ తీసుకున్న నిర్ణయాలు స్వాగతించారు కానీ. ఆయన సినిమా జూన్ 12న రిలీజ్ ఉందని మీకు (దిల్ రాజు)కు తెలుసు. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అని మీడియాలో స్క్రోలింగ్ వచ్చాయి. మరెందుకు ఖండించలేదు? మమ్మల్ని అడ్డుపెట్టుకుని నైజాం నవాబ్ కావాలని అనుకున్నారు. దానికి మేం ఒప్పుకోలేదు" అని అన్నారు.

"ప్రజలంతా గమనిస్తున్నారు. మా నాయకుడు (పవన్)కు, నేను ఎలాంటి వాడినో, దిల్ రాజు ఎలాంటి వాడో తెలుసు. ప్రపంచమంతా తెలుసు. మీ స్వార్థం తెలుసు. అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి 15 థియేటర్స్ ఉన్నాయని చెప్పారు. కానీ మీరు ఎందుకు సునీల్, సురేష్ బాబుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టలేదు" అని అడిగారు.

"ముగ్గురు కలిసి పని చేసి.. ఇప్పుడు నేను ఒక్కడినే చెబుతున్నారు. జనాలు పిచ్చోళ్ళు అనుకున్నారా. అందుకే మీరు చేసిన పనికి మైత్రీ మూవీ మేకర్స్ మీ అరచకాలు తట్టుకోలేక ఆఫీస్ పెట్టుకున్నారు. ఆ విషయం అందరికీ తెలియదా? చెప్పండి దిల్ రాజు? దిల్ రాజు డ్రీమ్స్ అంటే నైజాం నవాబ్ అవ్వడమా"అని క్వశ్చన్ చేశారు.

"ఏదో స్టేజ్ లో ఉన్నారట. ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్ గారికి సురేష్, దిల్ రాజు ఒత్తిడి చేసి ఛాంబర్ లో లెటర్ పెట్టించారు.. అది నిజం కాదా? ఆ లెటర్స్ ఉన్నాయి. మూడు సెక్టార్లలో ఆయన చెప్పారు. అప్పుడే పవన్ గారి సినిమా రిలీజైంది. మీరు, సురేష్ బాబు, శిరీష్ రెడ్డి ఉన్నారు. కానీ ఖండించలేదు" అని తెలిపారు.

"శిరీష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అని చెప్పారు. ఆన్ ది రికార్డ్స్ తీయండి. ఇప్పుడు నా మీద తీశారు. తప్పించుకుందామని అనుకుంటే దేవుడు ఉన్నారు. నా దేవుడు పవన్ ఉన్నారు. ఆయన అన్నీ చూస్తున్నారు. దుర్మార్గుల తొక్క తీసి అంతం చేస్తారు. నేను జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా" అని చెప్పారు.

అయితే సినిమా థియేటర్ల మూసివేత చుట్టూ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో సత్యనారాయణను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతడి హస్తం ఉందని ఆరోపణలు రావడంతో జనసేన ఆ నిర్ణయాన్ని ఇటీవల తీసుకుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.