దిల్ రాజు టికెట్ ధరల కామెంట్‌పై నిర్మాతల మాటేంటీ?
'తమ్ముడు' మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 12 Jun 2025 6:32 AM'తమ్ముడు' మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఫేక్ వ్యూస్‌తో పాటు టికెట్ రేట్ల పెంచడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీతో పాటు సినీ ప్రియుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే దిల్ రాజు టికెట్ రేట్లు పెంచుకోవడంపై చేసిన వ్యాఖ్యలు నిర్మాతల్లో కలవరాన్ని కలిగిస్తున్నాయి. టికెట్ రేట్లపై దిల్ రాజు ఏమన్నారంటే...
తెలుగు సినీ పరిశ్రమలో మార్పు రావాలన్నారు. 'నా సినిమాలకు టికెట్ రేట్‌లు పెంచను. తమ్ముడు సినిమాకు టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగను. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ప్రొడ్యూసర్ల బాధ్యత. టికెట్, స్నాక్స్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. అవి తప్పకుండా పాటిస్తాం. నిర్మాతలంతా తప్పకుండా పాటించాలి.
దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించాం. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదు. దీనిపై ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించాం. పవన్‌కల్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. హీరోలు తమ పారితోషికాల విషయంలో పునరాలోచించుకోవాలి. ఈ విషయంలో 'తమ్ముడు' హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు నాకు సహకరించారు. సక్సెస్ వచ్చినప్పుడు అందరి రెమ్యునరేషన్‌లు పెరుగుతాయి` అన్నారు.
దిల్ రాజు స్టేట్‌మెంట్ ఓకే మరి మిగతా ప్రొడ్యూసర్స్ దీన్ని స్వాగతిస్తారా? వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మించే నిర్మాతలు తమ సినిమా రిలీజ్ సమయంలో టికెట్ ధరలు పెంచుకోకుండా దిల్ రాజు మాటకే కట్టుబడి ఉంటారా?.. రేట్ల పెరుగుదలతో వచ్చే లాభల్ని దిల్ రాజు మాట ఇచ్చాడని వదులుకుంటారా?.. ఆయన మాటే శిలాశాసనం అని టికెట్ రేట్లు పెంచడానికి వీళ్లేదని ఒప్పుకుంటారా? అంటే అది అంత సులువు కాదు. ఎవరూ దిల్ రాజు స్టేట్‌మెంట్‌తో ఏకీభవించరు అన్నది వాస్తవం. దిల్ రాజు స్టేట్‌మెంట్‌పై మిగతా నిర్మాతలు స్పందిస్తారా? .. లేక సైలెంట్ అవుతారా? అన్నది వేచి చూడాల్సిందే.