Begin typing your search above and press return to search.

తమ్ముడుకి దిల్ రాజు మెరుగులు..!

దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు అన్నీ తానై చూసుకుంటాడు దిల్ రాజు.

By:  Tupaki Desk   |   20 May 2025 3:00 AM
తమ్ముడుకి దిల్ రాజు మెరుగులు..!
X

దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు అన్నీ తానై చూసుకుంటాడు దిల్ రాజు. కథ విని ఓకే చేసినప్పటి నుంచి షూటింగ్ లో ప్రతిదీ ప్రత్యేకంగా చూస్తాడు. అంతేకాదు సినిమా అవుట్ పుట్ ని కూడా అంచనా వేస్తాడు. ఎడిటింగ్ రూం లో ఫైనల్ మిక్సింగ్ లో రిలీజ్ ముందు ప్రమోషన్స్ ఇలా దిల్ రాజు అంటే నిర్మాతగా కాదు సినిమాకు అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేసే ఒక టెక్నీషియన్ గా ఉంటాడు. ఎందుకంటే డబ్బులు పెట్టేది తనే కాబట్టి ఆయన అంత జాగ్రత్త పడటంలో తప్పులేదు.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. అందులో నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు కూడా ఉంది. దిల్ రాజు బ్యానర్ లో ఆస్థాన దర్శకుడు అయిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా వస్తుంది. ఈ సినిమా విషయంలో దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమాలో నితిన్ తో పాటు ఒకప్పటి హీరోయిన్ లయ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. సినిమాలో మేజర్ హైలెట్స్ లో ఆమె రోల్ కూడా ఒకటని అంటున్నారు.

తమ్ముడు సినిమా నుంచి రీసెంట్ గా ఒక స్పెషల్ టీజర్ రిలీజైంది. అందులో పాత్రలను పరిచయం చేసి సినిమా ఎలా ఉండబోతుందో అని రుచి చూపించారు. ఐతే దిల్ రాజు ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా దాదాపు పూర్తి కాగా దిల్ రాజు తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తుంది. నితిన్ ఈమధ్య సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి కాబట్టి తమ్ముడు సినిమాతో అతనికి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు దిల్ రాజు.

అందులో భాగంగానే సినిమాని ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారట. నితిన్ కూడా తమ్ముడు సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఇదే కాదు నితిన్ నెక్స్ట్ వేణు డైరెక్షన్ లో చేస్తున్న ఎల్లమ్మ సినిమా కూడా దిల్ రాజు నిర్మాణంలోనే వస్తుంది. సో తమ్ముడు హిట్ ఆ సినిమా మీద కూడా ఇంపాక్ట్ కలిగిస్తుంది కాబట్టి ముందు రిలీజ్ కాబోతున్న తమ్ముడు సినిమా మీద దిల్ రాజు స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఈ తమ్ముడు ఏం చేస్తాడో చూడాలి.