గేమ్ ఛేంజర్.. అప్పుడే నా సిక్స్త్ సెన్స్ చెప్పింది: దిల్ రాజు
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ చిత్రం డిజాస్టర్ గా మారింది. ఇప్పుడు ఆ మూవీపై దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
By: Tupaki Desk | 25 Jun 2025 3:57 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఆ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ చిత్రం డిజాస్టర్ గా మారింది. ఇప్పుడు ఆ మూవీపై దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"డైరెక్టర్ శంకర్ తో పాటు నిర్మాత దిల్ రాజును నమ్మి ఆడియన్స్ సినిమాను చూశారు. ఆ సినిమా విషయంలో కాస్త ఎక్కడో తగ్గినట్టు అనిపిస్తుంది. మీరే కాంప్రమైజ్ అయ్యారా.. రామ్ చరణ్ మీకు నమ్మి సినిమా ఇచ్చారు" అని హోస్ట్ అడగ్గా.. "సినిమా విషయంలో ఓ రిగ్రెట్ ఉంది. శంకర్ వంటి పెద్ద డైరెక్టర్స్ తో ఇప్పటి వరకు వర్క్ చేయలేదు. వన్ టు వన్ వంటి డైరెక్టర్స్ తో వర్క్ చేశా" అని తెలిపారు.
"ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాం. మార్పులు చేర్పులు ఉంటే చెబుతుంటాను. కానీ శంకర్ గారితో సినిమా విషయానికొస్తే.. 45 నిమిషాలపాటు ఆయన నాకు కథ చెప్పారు. ఆయన ప్రొడ్యూసర్ కు కథ చెప్పరని విన్నాను. నాకైతే చెప్పారు. నేను చరణ్ తో మాట్లాడాను. జూమ్ కాల్ లో చరణ్ కు శంకర్ స్టోరీ చెప్పారు" అని దిల్ రాజు చెప్పారు.
"అంతా ఓకే అయ్యాక.. సినిమా స్టార్ట్ చేసి 2023 సంక్రాంతి లేదా సమ్మర్ కు రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఎన్నికలకు ముందే విడుదల చేద్దామని అనుకున్నాను. ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర టైమ్ తీసుకుందామని నిర్ణయించుకున్నాం. ఎన్నికల ముందే గేమ్ ఛేంజర్.. రిలీజ్ చేస్తే.. పొలిటికల్ జోనర్ మూవీ క్లిక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాం" అని పేర్కొన్నారు.
"సినిమా ప్రాసెస్ అయ్యాక.. ఒక్కో డిస్ట్రబెన్స్ స్టార్ట్ అయింది.. అన్నీ బ్యాలెన్స్ చేసుకుని మూవీ కంప్లీట్ చేశాం. రిజల్ట్ బాగోలేదని రిగ్రెట్ ఉండిపోయింది. మా బ్యానర్ 50వ సినిమా అలా అయింది. మిస్ ఫైర్ అవుద్దని ముందే సిక్స్త్ సెన్స్ చెప్పింది. ఎన్నికలు అయ్యాక పొలిటికల్ మూవీ చూస్తారా, ఆడియన్స్ రెడీగా ఉన్నారా అనే డౌట్ వచ్చింది" అని తెలిపారు.
"బడ్జెట్ ఎక్కడో వెళ్ళిపోయింది.. రికవరీ కనిపించడం లేదు.. థియేట్రికల్ బిజినెస్ లో తేడా ఉంది.. అలా చాలా సమస్యలు ఉన్నాయి.. అన్నీ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేశాం" అని దిల్ రాజు చెప్పారు. అదే సమయంలో ఇప్పుడు మార్కెట్ చాలా బ్యాడ్ గా ఉందని తెలిపారు. పరిస్థితులు బాగాలేవని, బయట నుంచి చూసినప్పుడు అద్భుతంగా ఉందన్నారు. లోపలికి వచ్చే పరిస్థితి వేరేలా ఉందని.. వచ్చాక ఏం చేయలేమని అభిప్రాయపడ్డారు.
