కోర్టు డైరెక్టర్ కి రాజు గారు ఆఫర్!
కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించడంలో దిల్ రాజు కూడా ముందు వరుసలో ఉంటోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 2:45 AMకొత్త వాళ్లకు అవకాశాలు కల్పించడంలో దిల్ రాజు కూడా ముందు వరుసలో ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన బ్యానర్ ద్వారా కొంత మంది నటీనటుల్ని, దర్శకుల్ని పరిచయం చేసారు. వేణు లాంటి కమెడియన్ డైరెక్టర్ అయ్యాడంటే? అందుకు కారణంగా రాజుగారు. ఇప్పుడు అదే బ్యానర్ లో భారీ ఎత్తున `ఎల్లమ్మ` సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రతిభావంతుల్ని ...కల్చర్ ని వెలుగులోకి తెస్తున్న నిర్మాతగానూ హైలైట్ అవుతున్నారు.
ఇక ఒక సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకుంటే అలాంటి డైరెక్టర్ కి రాజుగారు వరాల జల్లే కురిపిస్తారు. ఇప్పటికే మాలీవుడ్ నుంచి `మార్కో` ఫేం హానీఫ్ అదేని లాక్ చేసిన సంగతి తెలిసిందే. అతడితో రాజు గారు భారీ యాక్షన్ చిత్రాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా `కోర్టు` డైరెక్టర్ రామ్ జగదీష్ ని లాక్ చేసినట్లు వినిపిస్తుంది. నాని నిర్మించిన కోర్టు చిత్రం ద్వారా రామ్ జగదీష్ డైరెక్టర్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.
రైటర్ కం డైరెక్టర్ తొలి సినిమాతోనే సత్తా చాటాడు. అద్భుతమైన కోర్టు రూమ్ డ్రామా వార్ ని పండించి విమర్శకుల ప్రశంసలం దుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచిన చిత్రమిది. అందుకే రాజుగారు కన్ను ఆయన మీద పడింది. రామ్ జగదీష్ ని మంచి కథ సిద్దం చేసుకుని రమ్మన్నారుట. కథ నచ్చితే ఆ కథకు తగ్గ హీరోను తానే సెట్ చేసి బడ్జెట్ ఎంతనైనా నిర్మిస్తానని చెప్పా రుట.
ఒక్కసారి రాజుగారి కాంపౌండ్ లోకి ప్రతిభావంతులు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఓ హిట్ ఇచ్చారంటే? నాలుగైదు సినిమాలు అదే బ్యానర్ లో చేసేలా అగ్రిమెంట్ చేసు కుంటారు. మరి ఇలాంటి ప్రతిభావంతుడిని నాని అంత ఈజీగా బయటకు వదులుతాడా? అన్నది చూడాలి.