Begin typing your search above and press return to search.

'ఆ నలుగురు'.. నిర్మాత దిల్ రాజు ఏమన్నారంటే?

ఏషియన్‌, సురేశ్‌ కంపెనీ వాళ్లవి 90 ఉండగా.. 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్ళు మాత్రమే నడుపుతున్నట్లు వెల్లడించారు దిల్ రాజు.

By:  Tupaki Desk   |   26 May 2025 5:15 PM IST
ఆ నలుగురు.. నిర్మాత దిల్ రాజు ఏమన్నారంటే?
X

తెలుగు సినీ ఇండస్ట్రీ ఆ నలుగురు చేతిలో ఉందని కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన.. ఏపీ డిప్యూటీ సాబ్ పవన్ కళ్యాణ్ పేషీ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత ఆ విషయంపై ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. దీంతో ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యి.. ఆ నలుగురిలో లేనని చెప్పారు.

15 ఏళ్ల క్రితం.. ఆ నలుగురు పదం స్టార్ట్ అయిందని.. ఇప్పుడు ఆ నలుగురు కాస్త 15 మందిగా మారారని తెలిపారు. దీంతో ఒక్కసారి మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. అదే సమయంలో ఇప్పుడు దిల్ రాజు రెస్పాండ్ అయ్యారు. నైజాంలో 370 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు ఉంటే.. ఎస్వీసీఎస్‌ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమేనని స్పష్టం చేశారు.

ఏషియన్‌, సురేశ్‌ కంపెనీ వాళ్లవి 90 ఉండగా.. 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్ళు మాత్రమే నడుపుతున్నట్లు వెల్లడించారు దిల్ రాజు. కానీ ఆ నలుగురు అంటూ వార్తలు వస్తున్నాయని, అందుకే క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. పర్సనల్ ఎటాక్ లా ఉందని తెలిపారు. ఎగ్జిబిటర్స్ తము కావాల్సింది అడగడం తప్పు లేదని అన్నారు

అయితే పర్సంటేజీల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉండటం నిజమేనని అన్నారు. చెప్పాలంటే.. ఏప్రిల్‌ నెలలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజీ అంశాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు. వాళ్ల కష్టాలన్నీ తమకు తెలుసు అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

అదే సమయంలో రెవెన్యూ విషయం కోసం మాట్లాడినప్పుడు.. పర్సంటేజ్‌ విధానం ఉంటే బాగుంటుందని వారు చెప్పారని అన్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్‌ ఆర్‌ పర్సంటేజ్‌ విధానం నడుస్తోందని తెలిపారు. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే, రెంట్‌ ఇస్తున్నామని వెల్లడించారు. సెకండ్‌ వీక్‌ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజ్‌ ఇస్తున్నట్లు చెప్పారు.

నిజానికి.. అది వాళ్లకు కష్టమైనదని తనకు తెలుసని అన్నారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయని, పర్సంటేజీ సమస్య ఈస్ట్‌ గోదావరి నుంచి మొదలై నైజాంకు కూడా వచ్చిందని చెప్పారు. అప్పుడు ఇక్కడి ఎగ్జిబిటర్లు దానిని శిరీష్‌ దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు 20 ఏళ్ల నుంచి ఆ ఎగ్జిబిటర్లతో వ్యాపారం అనుబంధం ఉందని స్పష్టం చేశారు. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాలే పరిష్కరించాలని, అందుకే ఈ ఎపిసోడ్‌ ను ఇప్పటికైనా తెర దించుదామని కోరారు.