అల్లు అర్జున్ చేయగలిగింది నితిన్ చేయలేకపోయాడు
నితిన్ హీరోగా వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 30 Jun 2025 6:00 PM ISTనితిన్ హీరోగా వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటి లయ తమ్ముడులో కీలక పాత్రలో నటిస్తున్నారు. జులై 4న తమ్ముడు ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తో పాటూ నిర్మాత దిల్ రాజు కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
అందులో భాగంగా నితిన్, దిల్ రాజు కలిసి ఓ చిట్ చాట్ నిర్వహించగా, అందులో దిల్ రాజు నితిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అతను నిర్మాతగానే నితిన్ దిల్ మూవీ చేయగా, ఇప్పుడు మరోసారి తమ్ముడు చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో నితిన్, దిల్ రాజును ఓ ప్రశ్న అడిగారు. దిల్ సినిమా నుంచి తమ్ముడు సినిమా వరకు మీరు నాలో చూసిన మార్పులు, ప్లస్, మైనస్‌లు ఏంటని నితిన్ దిల్ రాజు ను అడిగారు.
ప్లస్సులు, మైనస్సులు పక్కన పెడితే నువ్వు నా కంటే ఒక సంవత్సరం సీనియర్ అని, తాను 2003లో నిర్మాతగా మారగా, 2002లోనే నువ్వుగా హీరోగా అయ్యావని, నా కంటే ముందే నువ్వు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోవయ్యావని దిల్ రాజు నితిన్ తో అన్నారు. ఎలాంటి సినిమానైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ, మేనేజ్ చేసే రేంజ్ ఇప్పుడు నితిన్ కు వచ్చిందని దిల్ రాజు అన్నారు.
నితిన్ కంటే ఒక సంవత్సరం ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తాను నిర్మాతగా ఒక్కొక్కటి సాధించుకుంటూ టాప్ లోకి వెళ్లానని, నితిన్ ను కూడా తాను అలానే ఊహించానని కానీ అది నితిన్ అఛీవ్ చేయలేకపోయాడని అన్నారు దిల్ రాజు. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌ను, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నితిన్ ను తాను ఫ్యూచర్ స్టార్లు గా భావించానని దిల్ రాజు చెప్పారు.
అయితే తన అంచనాలను అల్లు అర్జున్ అందుకుని ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ కు వెళ్లాడని, కానీ నితిన్ మాత్రం ఆ స్టేజ్ కు చేరుకోలేకపోయాడని దిల్ రాజు అన్నారు. అయితే తమ్ముడు సినిమాతో తనకు ఆ రేంజ్ వస్తుందా అని నితిన్, దిల్ రాజును అడగ్గా, తమ్ముడు సినిమాతో సక్సెస్‌ఫుల్ హీరోగా అవుతావు కానీ అది సరిపోదని, ఎల్లమ్మతో ఆ రేంజ్ ను అందుకోవాలని దిల్ రాజు నితిన్ తో చెప్పారు. ప్రస్తుతం నితిన్- దిల్ రాజుకు సంబంధించిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
