గేమ్ ఛేంజర్‌పై దిల్ రాజు మరో బాంబ్!
శంకర్ భారీ ఖర్చు చేయించి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిన హీరో రామ్‌చరణ్‌కు, నిర్మాతగా దిల్ రాజుకు కోలుకోలేని దెబ్బకొట్టింది.
By: Tupaki Desk | 27 Jun 2025 12:30 PMశంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'RRR' తరువాత గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్‌చరణ్ ఈ మూవీ కోసం దాదాపు రెండేళ్లకు పైనే సమయం కేటాయించాడు. అయితే రెండున్నరేళ్లకు పైగా చరణ్ శ్రమించిన ఈ మూవీ అశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కథ, కథనాలు తీసిపారేసే విధంగా లేకపోయినా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ మహేష్ `భరత్ అనే నేను` బెటర్ అనే ఫీల్‌ని కలిగించింది.
శంకర్ భారీ ఖర్చు చేయించి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిన హీరో రామ్‌చరణ్‌కు, నిర్మాతగా దిల్ రాజుకు కోలుకోలేని దెబ్బకొట్టింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే దిల్ రాజుకు ఓ `నైట్‌మేర్`గా మారి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని కలిగించింది. పెద్ద దర్శకులని నమ్మి ఇలాంటి ప్రాజెక్ట్ చేయకూడదనే గుణపాఠాన్ని నేర్పింది. సినిమా రిలీజ్ తరువాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలిచి సినీ లవర్స్‌ని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే.
`గేమ్ ఛేంజర్` నా కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పిదమని దిల్ రాజు స్టేట్‌మెంట్ ఇచ్చారంటే ఈ సినిమా తనని ఎంతగా డిస్ట్రబ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అలాంటి వ్యాఖ్యలనే దిల్ రాజు మరో సారి చేయడం ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సమయంలో శంకర్ దీని షూటింగ్‌కు పాజ్ ఇచ్చి `ఇండియన్ 2` షూటింగ్‌కు వెళ్లి పోయారు. అయినా సరే చరణ్ మరో సినిమా చేయకుండా దీని కోసమే టైమ్ వేస్ట్ చేయడం వల్ల తను ఇబ్బందిపడ్డారు కదా అని ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజుని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
'గేమ్ ఛేంజర్' షూటింగ్ డిలే కావడం వల్ల చరణ్‌కు ఏడాదిన్నర టైమ్ వేస్టయింది. ఈ టైమ్‌లో తను వేరే ప్రాజెక్ట్ చేస్తే బాగుండేది. కానీ తను చేయలేదు. దీని షూటింగ్‌ని ఆపి శంకర్‌గారు ఎప్పుడైతే ఇండియన్ 2కు వెళ్లిపోయారో అప్పుడే నేను చరణ్‌తో చెప్పాను. ఏదైనా స్క్రిప్ట్ సెట్టయితే ఈ సమయాన్ని దానికి కేటాయించమని చెప్పాను. నిర్మాతగా నా హీరో సేఫ్‌గా ఉండాలని కోరుకున్నాను. కానీ చరణ్ మాత్రం ఈ సినిమా కోసం చేసుకున్న మేకోవర్, లుక్స్ మనం అనుకున్నట్టుగా రావేమోనని, మనం పెద్ద సినిమా చేస్తున్నాం అని ఆగిపోతూ వచ్చాడు. దాంతో అతని టైమ్ వేస్టయింది` అని ఇండైరెక్ట్‌గా శంకర్ వల్లే చరణ్ టైమ్ వేస్టయిందని అసలు విషయం బయటపెట్టారు.