మాటపై నిలబడిన దిల్ రాజు!
శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫేక్ వ్యూస్‌పై నిర్మాత దిల్ రాజు సంచలన కామెంట్స్ చేయడం చర్చకు దారితీసింది.
By: Tupaki Desk | 17 Jun 2025 5:30 PMకొంత మంది స్టేజ్ ఎక్కడమే ఆలస్యం ఇష్టమొచ్చిన స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తుంటారు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లపై నిలబడరు, తూచ్ అదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పారేస్తుంటారు. ఈజీగా తప్పించుకుంటుంటారు. కానీ దిల్ రాజు మాత్రం ఇచ్చిన స్టేట్‌మెంట్ విషయంలో తల్లేదేలే అంటున్నారు. విషయం ఏంటంటే.. నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా `తమ్ముడు`. ఈ మూవీని జూలై 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
చాలా ఏళ్ల విరామం తరువాత హీరోయిన్ లయ రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. ఇందులో నితిన్‌కు జోడీగా `కాంతార` ఫేమ్ సప్తమిగౌడ నటిస్తోంది. ఇతర పాత్రల్లో వర్ష బొల్లమ్మ, స్వాసిక విజయ్, సౌరభ్ సచ్‌దేవ్, చమ్మక్ చంద్ర నటిస్తున్నారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫేక్ వ్యూస్‌పై నిర్మాత దిల్ రాజు సంచలన కామెంట్స్ చేయడం చర్చకు దారితీసింది. యూట్యూబ్‌లో ట్రైలర్ ఎంత రీచ్ అయితే మన సినిమా రీచ్ ఏంటో తెలుస్తుందని, ఒరిజినల్ నంబర్సే ఉండాలని, వ్యూస్‌ని కొనొద్దని పీఆర్ టీమ్‌కు చెప్పానన్నారు.
ఇకపై పెయిడ్ ఫేక్ వ్యూస్‌కి దూరంగా ఉంటానని, జెన్యూన్ వ్యూస్‌నే నమ్ముతానని దిల్ రాజు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట మీద ఆయన నిలబడతారా? అనే చర్చ ఇటీవల జరిగింది. అయితే `తమ్ముడు` ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్ విషయంలో దిల్ రాజు ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నారట. దానికి నిదర్శనమే `తమ్ముడు` ట్రైలర్ యూట్యూబ్‌లో 2.9 మిలియన్ ప్లస్ జెన్యూన్ వ్యూస్‌ని సాధించడం అని తెలుస్తోంది. ఈ వ్యూస్ మిగతా తెలుగు సినిమా ట్రైలర్ ల వ్యూస్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం గమనార్హం.
మిగతా సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే 10 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని రాబడితే `తమ్ముడు` మాత్రం 2.9 మిలియన్‌ల మించి ఆర్గానిక్ వ్యూస్‌ని రాబట్టడంతో ఈ ఫిగర్‌ని చూసిన వాళ్లంతా దిల్ రాజు చెప్పిన మాటకు కట్టుబడి తన సినిమా ట్రైలర్ రికార్డుల కోసం ఫేక్ వ్యూస్‌ని కొనలేదని అంతా అవాక్కవుతున్నారు. గతంలో ఫ్లస్ అయిన సినిమాల ట్రైలర్‌ల వ్యూస్ మిలియన్‌ల దాటేస్తే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయి విజయాన్ని దక్కించుకోకపోవడంతో వ్యూస్‌ని బట్టి సినిమాలు ఆడవని, కంటెంట్ ఉంటేనే ఆడతాయని నిరూపితమైంది. దీన్నే దిల్ రాజు బలంగా నమ్మి నట్టున్నాడని అందుకే జెన్యూన్ వ్యూస్‌ని మాత్రమే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.