నితిన్ 'తమ్ముడు'.. అన్నిట్లో దిల్ రాజు నిజాయితీగా..
కానీ దిల్ రాజు మాత్రం.. తమ్ముడు విషయంలో ఫేక్ జోలికి వెళ్లలేదని స్పష్టంగా చెప్పవచ్చు.
By: Tupaki Desk | 6 July 2025 1:11 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. రీసెంట్ గా తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అక్క-తమ్ముడు సెంటిమెంట్ స్టోరీతో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన తమ్ముడు సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్లు మాత్రం అందుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తక్కువ టైమ్ లోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. జూలై లాస్ట్ లోనే అందుబాటులోకి రానుందని సమాచారం.
అదంతా పక్కన పెడితే.. తమ్ముడు మూవీ విషయంలో దిల్ రాజు నిజాయితీగా ఉన్నారని ఇప్పుడు క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం రోజుల్లో అనేక సినిమాల మేకర్స్ ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ట్రైలర్ వ్యూస్ నుంచి కలెక్షన్స్ వరకు ఫేక్ గా చెబుతున్నారని అంటున్నారు.
కానీ దిల్ రాజు మాత్రం.. తమ్ముడు విషయంలో ఫేక్ జోలికి వెళ్లలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన గత సినిమా గేమ్ ఛేంజర్ వసూళ్ల విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఆయన.. ఇప్పుడు మాత్రం అలా జరగలేదు. ప్రమోషన్స్ లో భాగంగా కొద్ది రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ కు వ్యూస్, లైక్స్ మాత్రం తక్కువ వచ్చినట్లు టాక్.
నితిన్ గత మూవీ రాబిన్ హుడ్ ట్రైలర్ వ్యూస్ కన్నా తక్కువే వచ్చినా.. మేకర్స్ మాత్రం ఎలాంటి ఫేక్ పోస్టర్స్ రిలీజ్ చేయలేదు. కృత్రిమంగా ఎటువంటి బూస్టింగ్ జరగలేదు. ఓపెనింగ్స్ అనుకున్నట్లు రాలేకపోయినా.. మేకర్స్ ఉత్తుత్తి సందడి చేయలేదు. ఎలాంటి ప్రెస్ మీట్స్ కూడా నిర్వహించలేదు. దీంతో అంతా స్పందిస్తున్నారు.
ఎందుకంటే.. సినిమా రిజల్ట్ మిక్స్ డ్ గా ఉన్నా.. కొందరు మేకర్స్ సక్సెస్ మీట్స్, మీటింగ్స్ అంటూ సందడి చేస్తున్నారని చెప్పాలి. రివ్యూస్ ఎలా ఉన్నా వేడుకలు మాత్రం జరుపుతున్నారు. కానీ ఇప్పుడు తమ్ముడు మూవీ విషయంలో దిల్ రాజు సహా టీమ్ పారదర్శకత ప్రత్యేకంగా నిలిచింది. నిజాయితీగా నిలిచింది. తమ గౌరవాన్ని అలానే సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు అంతా అభినందిస్తున్నారు.. ప్రశంసిస్తున్నారు.
