టాలీవుడ్ లో గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే?
దిల్ రాజు బ్యానర్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా ప్రచారంలో భాగంగా `గేమ్ ఛేంజర్` టాపిక్ వస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 July 2025 8:30 PMదిల్ రాజు బ్యానర్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా ప్రచారంలో భాగంగా 'గేమ్ ఛేంజర్' టాపిక్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దిల్ రాజు సోదరుడు కూడా 'గేమ్ ఛేంజర్' గురించి వైఫల్యం గురించి మాట్లా డే క్రమంలో అది కాస్త నెగిటివ్ గాను జనాల్లోకి వెళ్లింది. దీంతో రెండు..మూడు రోజులుగా `గేమ్ ఛేంజర్` అంశంగా చర్చగా మారింది. అదంతా పక్కన బెడితే `గేమ్ ఛేంజర్` విషయంలో దిల్ రాజు గట్స్ ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసారు.
ఆ సినిమాను దిల్ రాజు ఎంతో ఫ్యాషన్ గా...ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శంకర్ తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉన్న కోరికను `గేమ్ ఛేంజర్` తో తీర్చుకు న్నారు. వాస్తవానికి అప్పటికే శంకర్ వరుస ప్లాప్ ల్లో ఉన్నారు. శంకర్ తో సినిమా తీయోద్దని సలహాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. కోలీవుడ్ లో కూడా శంకర్ తో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయనతో సినిమా అంటే రిస్క్ అని భావించి ముందు కు రాలేదు. ఇక టాలీవుడ్ సీనియర్ నిర్మాతలైతే రాజుగారికి కూడా రిస్క్ తీసుకోవద్దు అనే సలహాలు ఇచ్చారు.
రాజుగారు మాత్రం 'గేమ్ ఛేంజర్' ని ఓ ప్యాషన్ గా భావించారు. చరణ్- శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా చూడాల నుకున్నారు. కేవలం డబ్బు కోసమే ఆ సినిమా మొదలు పెట్టలేదు. డబ్బు కోసమే అయితే ఆయ నకు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకులెంతో మంది ఉన్నారు. వాళ్లతోనే సినిమా తీసుకునేవారు. అలాంటిది ఆశించకుండా శంకర్ తో తాను ఓ సినిమా తీసానని సినిమా అనే చరిత్రలో చెప్పుకోవడం కోసం చేసిన ప్రయత్నం. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం కలిసి రాలేదు.
ప్రతిగా విమర్శల పాలవ్వాల్సి వచ్చింది. కానీ నిర్మాతగా టాలీవుడ్ లో ఎవరూ చేయని సాహసం చేసారు. ఆ రకంగా రాజు గార్ని మెచ్చుకోవాల్సిందే. గేమ్ ఛేంజర్ రిలీజ్ అయి ఆరు నెలలు గడిచినా ఇంకా మీడియా లో కూడా అదే చర్చ జరుగుతుంది అంటే అది రాజుగారి ప్రత్యేకతే. ఈ సినిమాకొచ్చిన నష్టాలను `సంక్రాం తికి వస్తున్నాం` సినిమాతో భర్తీ చేసారు. లక్కీగా ఆ సినిమా హిట్ అవ్వడంతో రాజుగారు పెద్ద గండంనుంచి బయట పడ్డారు. లేదంటే? చాలా ఇబ్బందులు పడేవారు అన్నది అంతే వాస్తవం. ఈ విషయాన్ని రాజు-శిరీష్ లు ఓపెన్ గానే చెప్పిన సంగతి తెలిసిందే.