గేమ్ ఛేంజర్.. ఫైనల్ గా ఆ నష్టమెంతో చెప్పిన దిల్ రాజు
ఈ నేపథ్యంలో దిల్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ, “గేమ్ ఛేంజర్ నాకు కెరీర్‌లో వచ్చిన అతిపెద్ద నష్టం” అని స్పష్టంగా చెప్పారు.
By: Tupaki Desk | 1 July 2025 5:18 AMటాలీవుడ్ నిర్మాతల్లో మంచి సక్సెస్ రేటుతో కొనసాగుతున్న వారిలో దిల్ రాజు టాప్ లిస్టులో ఉన్నారని చెప్పవచ్చు. కథల ఎంపిక, రిలీజ్ టైమింగ్, కమర్షియల్ హిట్‌లుగా నిలిచే చిత్రాల నిర్మాణంలో అతడికి ప్రత్యేకమైన ట్రాక్ ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ వల్ల ఎదురైన నష్టాలు దిల్ రాజుకు నెవ్వర్ బిఫోర్ అనేలా షాక్ ఇచ్చాయి.
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పై మొదట్లో ఊహించని రీతిలో హైప్ క్రియేట్ అయింది. స్టార్ కాంబో, భారీ బడ్జెట్, ఫెస్టివల్ రిలీజ్.. ఇలా అన్ని పాజిటివ్ మూమెంట్స్ కనిపించినా, సినిమా రిలీజ్ సమయంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆలస్యాల వల్ల బజ్ తగ్గింది. కంటెంట్ విషయంలో నిరుత్సాహకరమైన టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో దిల్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ, “గేమ్ ఛేంజర్ నాకు కెరీర్‌లో వచ్చిన అతిపెద్ద నష్టం” అని స్పష్టంగా చెప్పారు. ఈ సినిమా వలన రూ.100 కోట్లకు పైగా నష్టం వచ్చిందని స్వయంగా అంగీకరించారు. రిలీజ్‌కు ముందే సినిమా క్లిక్ అవుతుందా? లేదా? అన్న అనుమానం అనుమానం తలెత్తిందనీ.. ‘సిక్స్‌త్ సెన్స్’ ముందే హెచ్చరించిందని చెప్పారు.
అయితే అదే సమయంలో ఆయన బ్యానర్ నుంచి వచ్చిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం కొంత ఊరటనిచ్చింది. దిల్ రాజు మాటల్లో చెప్పాలంటే, “ఆ సినిమా నుంచి నేను లాభం తీసుకోలేదు. గేమ్ ఛేంజర్ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సంపూర్ణంగా సంక్రాంతికి వస్తున్నాం వసూళ్లను కేటాయించాను,” అన్నారు. దీంతో ఫైనాన్షియల్‌గా వారి పరిస్థితి కొంత మెరుగైందని పేర్కొన్నారు.
ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల సహకారం ఎంతో కీలకమైందని దిల్ రాజు తెలిపారు. “సంక్రాంతి రిలీజ్‌కి తమ సినిమాలు పోటీగా ఉండకూడదని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సహకారం వల్లే మేము ఆ టైమింగ్లో విడుదల చేయగలిగాం,” అని తెలిపారు. ఈ సినిమా విజయంతో ఇండస్ట్రీలో కొంతమందికి ఊపిరి పీల్చుకునే అవకాశం లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై ఏ ప్రాజెక్ట్ చేయాలి, ఎలాంటి స్క్రిప్ట్ ఎంపిక చేసుకోవాలి అన్న విషయాల్లో మరింత జాగ్రత్త పడతానని చెప్పకనే చెప్పాడు.