గేమ్ ఛేంజర్.. ఇప్పటికీ అదే ఫీలింగ్ లో దిల్ రాజు..!
ఐతే ఆ సినిమా విషయంలో తాను ఏమి చేయలేకకపోయానని.. తన చేతుల్లో ఏమి లేకుండాపోయిందని అన్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 5:12 PMగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంక్రాంతికి వచ్చి అంచనాలను అందుకోలేదు. శంకర్ లాంటి డైరెక్టర్ తో RRR హీరో చరణ్ లీడ్ రోల్ అనే సరికి ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఏర్పడ్డాయి. అందులోనూ దిల్ రాజు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా అది తెరకెక్కింది. తీరా రిజల్ట్ చూస్తే మాత్రం చాలా డిజప్పాయింట్ చేసింది. ఐతే గేమ్ ఛేంజర్ అని ఎక్కడ వినిపించినా దిల్ రాజు ఉలిక్కి పడతారు. లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ విషయంలో ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతున్న విషయాన్ని వెల్లడించారు.
తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో RRR తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని అన్నారు దిల్ రాజు. ఐతే ఆ సినిమా విషయంలో తాను ఏమి చేయలేకకపోయానని.. తన చేతుల్లో ఏమి లేకుండాపోయిందని అన్నారు. సో శంకర్ సినిమాగా వచ్చిన గేమ్ ఛేంజర్ లో తన ఇన్వాల్వ్ మెంట్ ఏమి లేదని చెప్పకనే చెప్పారు దిల్ రాజు.
దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే ఆయనే అన్నీ అన్నట్టుగా చూస్తారు. అందుకే ఆయనకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుందని అంటారు. ఐతే గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం తన ప్రమేయం లేకుండా అన్నీ అలా జరిగిపోయాయని అన్నారు దిల్ రాజు. ఐతే సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ కోపరేషన్ బాగుందని చెప్పారు. శంకర్, రామ్ చరణ్ కాంబోలో 300 కోట్ల పైన బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ తెరకెక్కింది. సినిమాలోని సాంగ్స్ కోసమే కోట్లు ఖర్చు పెట్టారు.
ఐతే సినిమా ఆశించిన రేంజ్ లో లేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాదు దిల్ రాజు కెరీర్ లోనే బిగ్ ఫ్లాప్ గా నిలిచింది. అందుకే ఇక మీదట అలాంటి తప్పు జరగకూడదని కంటెంట్ ఉన్న సినిమాల మీదే గురి పెడుతున్నారు దిల్ రాజు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా జూలై 4న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద దిల్ రాజు చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. మంచి సినిమా ఎక్కువమంది జనాల్లోకి వెళ్లాలని ప్రమోషన్స్ లో తానే మొదట పాల్గొంటున్నా అని అన్నారు దిల్ రాజు.