థియేటర్లు మూతపడుతున్న వేళ ఆ నలుగురు?
థియేటర్లకు ఫీడింగ్ లేక మూతపడుతున్న వేళ ఆ నలుగురు అన్న టాపిక్ ఎక్కడిది? ఇంకా పాత చింతకాయ్ పచ్చడి స్టోరీ లెందుకంటున్నారు దిల్ రాజు.
By: Ravindar Gorantla | 28 April 2026 6:00 PM ISTథియేటర్లకు ఫీడింగ్ లేక మూతపడుతున్న వేళ ఆ నలుగురు అన్న టాపిక్ ఎక్కడిది? ఇంకా పాత చింతకాయ్ పచ్చడి స్టోరీ లెందుకంటున్నారు దిల్ రాజు. థియేటర్లుకు సమ్మర్ సీజన్ ఓ వరం లాంటిది. అలాంటి సమ్మర్ సీజన్‌ని ఖాలీగా వదిలేయడంతో ఇప్పుడు అంతా ఫీడింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఇదే సందర్భంగా `తమ్ముడు` విషయంలో మీ అంచనా తప్పిందనే ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించారు. ఆడియన్స్‌కి ఎకానమీతో సంబంధం లేదని, సినిమాలో వావ్ అనిపించి ప్రేక్షకుల చేత నాలుగు సార్లు చప్పట్లు కొట్టించే సీన్స్ ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్. కోర్టు రిలీజ్‌కు ముందు ట్రైలర్ చూసిన నేను నానికి ఫోన్ చేశాను. నాని ట్రైలర్ బాగుంది. ఆ ఇంటెన్స్ కనిపిస్తోంది. అప్పటికే రిలీజైన ఓ పాట కూడా బాగుంది. మంచి హిట్టయింది. సినిమాపై చాలా పాజిటీవ్‌గా ఉంది నాని సినిమా మొత్తం చూశావు కాదా? నీ ఒపీనియన్ ఏంటీ? అని అడిగితే `మన చేతిలో గుడ్ మూవీ ఉంది.
ప్రేక్షకులు ఏం రిజల్ట్ ఇస్తారో చూద్దాం. సినిమా రిలీజ్ కంటే ముందే ప్రివ్యూ షోలు వేశారు. ప్రీమియర్ షోస్ పట్డాయి పాజిటివ్ టాక్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది..బాగుంది అన్నారు. నెక్ట్ డే థియేటర్స్ అన్నీ ఉంది. అన్నారు. మాకు ఇంత వరకే తెలుస్తుంది. మా సినిమా `తమ్ముడు` విషయంలోనూ మేము కూడా ఇదే ఒపీనియన్‌తో ఉన్నాం. సినిమా చూసుకున్నాం. సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. టెంపో ఎక్కడా ఆగట్లేదు దడ్ దడ్ దడ్ వెళుతుంది. ఇది మేము నమ్మిన నిజం`అన్నారు.
అది ఒక బోర్ టాపిక్...
ఆ నలుగురు అనేది ఒక బోర్ టాపిక్. ఒకప్పుడు థియేటర్లు ఆ నలుగురి వద్దే ఉన్నాయి. మాకు థియేటర్లు దొరకట్లేదు అనేది ఒక పాత స్టోరీ. ఇప్పుడు సీన్ మారింది. ఈ రోజు థియేటర్లు మూత పడుతున్నాయి. ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది?. ప్రస్తుతం థియేటర్లు నడవక మూత పడుతున్నాయి. థియేటర్లలో సినిమాలు లేక సినిమాలు లేక రీ రిలీజ్ అన్నా కూడా థియేటర్లలో వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రీ రిలీజ్‌లు అవుతున్నాయి అంటే ఏంటీ థియేటర్లకు కంటెంట్ లేదనే కదా?..ఇప్పుడు బిజినెస్ మారిపోయింది. అంతకు ముందు ఒకలా ఉన్న బిజినెస్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి. అది పక్కన పెట్టి ఆనలుగురు అంటూ పాత చింతకాయ పచ్చడి స్టోరీలు ఎందుకు?.
వాటిని కాపాడుకుంటేనే...
సింగిల్ స్క్రీన్స్‌ని కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాగుంటుంది. సింగిల్ థియేటర్ ప్రేక్షకుడికి కన్వీనియంట్‌గా ఉంటుంది. మల్టీప్లెక్స్‌లకు వెళ్లాలంటే రూ.250 టికెట్.అదే సింగిల్ స్క్రీన్స్ బాల్కనీకి వెళితే రూ.100. రెండవ క్లాస్‌కి వెళితే రూ.50 అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేది సింగిల్స్ స్క్రిన్‌లోనే. కొంత పర్సంటేజ్ ఆడియన్స్ మాత్రమే మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళతారేమో. కానీ ఎక్కువ శాతం మాత్రం సింగిల్ స్క్రీన్ లకే వెళతారు. అలాంటి సింగిల్ స్క్రీన్స్‌ని కాపాడకుంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్‌ని ఇండస్ట్రీ శాశ్వతంగా మిస్సవుతుంది. ప్రేక్షకుడికి టికెట్ రేట్లు, క్యాంటీన్ రేట్లు, థియేటర్ మెయింటెనెన్స్ భారీగా పెంచేస్తే సగుటు ప్రేక్షకుడు థియేటర్లకు ఎందుకు వస్తాడు? కావాల్సిన నప్పుడు టికెట్ రేట్లు పెంచి రావొద్దని చెబుతున్నాం. క్యాంటిన్ రేట్లు పెంచి థియేటర్లకు రావోద్దని చెబుతున్నాం. ఇది సింగిల్ థియేటర్స్ ప్లాబ్లం. మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్, క్యాంటిన్ రేట్లు అన్నింటిమీద డబుల్. ఒక సినిమాకు ఫ్యామిలీ వెళ్లాలంటే రూ.1500 నుంచి రూ.2000 మాత్రం ఖర్చు చేసే వాళ్లే వెళతారు. యావరేజ్ అని తెలిస్తే థియేటర్లకు రావడం లేదు. ఓటీటీలలో చూసేస్తున్నారు.
