రాజుగారు ట్రైనింగ్ తో మోసాలకు చెల్లు చీటు!
తొలిసారి హైదరాబాద్ ఓ సినిమా కొందామని దిల్ రాజు- శిరీష్ వచ్చారుట. దర్శక నిర్మాతలతో చర్చించి ఓ సినిమా కొన్నారుట.
By: Tupaki Desk | 30 Jun 2025 12:00 AM IST'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో నిర్మాత దిల్ రాజు ఓ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో రాణించాలనుకునే వారికి ఈ సంస్థ ద్వారా దిల్ రాజు శిక్షణ అందించనున్నారు. నటుడు అవ్వాలనుకుంటే నటుడిని చేస్తారు. నిర్మాత అవ్వాలనుకుంటే నిర్మాతగా తీర్చి దిద్దుతారు. ఇలా ఏ విభాగంలో సక్సెస్ అవ్వాలనుకుంటే ఆ విభాగంలో తర్పీదు ఇప్పించి పరిశ్రమలోకి వదులుతారు.
ఈ క్రమంలో ఇండస్ట్రీలో మోసాలు ఎలా జరుగుతాయో కూడా రాజుగారు దగ్గరుండి మరీ వివరిస్తారు. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ గానే చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన తన ప్రయాణం నిర్మాతగా ఎదిగే క్రమంలో తాను ఎలా మోసపోయాను అన్నది కూడా పూసగుచ్చారు. ఇండస్ట్రీలో జరిగే మోసాలను పసిగ ట్టకపోతే నిండా మునిగిపోతామని తనకు ఎదురైన ఓఅనుభవాన్ని కూడా పంచుకున్నారు.
తొలిసారి హైదరాబాద్ ఓ సినిమా కొందామని దిల్ రాజు- శిరీష్ వచ్చారుట. దర్శక నిర్మాతలతో చర్చించి ఓ సినిమా కొన్నారుట. అదే సినిమా ఓపెనింగ్ రోజు మళ్లీ ఆహ్వానించారుట. సెట్ కి వెళ్లగానే సార్ మీరు చూడటానికి బాగున్నారు. ఈసినిమాలో నటించమని అడిగారుట. ఒకే చెప్పి మరుసటి రోజు సెట్ కి వెళ్లే సరికి అక్కడ బ్యానర్లు కట్టారుట. లోపలకు వెళ్లిన తర్వాత మ్యాకప్ మ్యన్ ఏకప్ వేసాడుట.
సాయంత్రం ఆరు గంటల తర్వాత తీసుకెళ్లి ఓ గంట కొట్టించి మీ షూట్ అయిపోయిందని చెప్పారుట. తాము సినిమా కొంటున్నారు కాబట్టి ఇలాంటి యాక్టింగ్ లు చేసారన్నారు. తర్వాత అన్నదమ్ములిద్దరు చర్చించుకుని ఆ సినిమాకు ఇచ్చిన అడ్వాన్స్ వదులకుని మరో సినిమా కొన్నట్లు వెల్లడించారు. ఇండస్ట్రీలో ఇలాంటి మోసాలెన్నో. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే నిర్మాత ఎవరూ మోసపోకుండా ఆ రకమైన శిక్షణ కూడా తమ సంస్థలో అందిస్తామన్నారు.
నిర్మాతలకే కాదు డబ్బుండి, సినిమాలపై ప్యాషన్ తో వచ్చిన వారు ఎవరైనా సరే రాజుగారు ముందుగా ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇదే. అప్పుడే మోసాలు ఎలా జరుగుతాయో తెలుస్తాయి. భజన చేయడానికి దగ్గరకు వచ్చిన వాళ్లను ఎలా తరిమేయాలో అర్ధమవుతుంది. ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ ఒక్కరు ముందు ఇక్కడ జరిగే మోసాలను స్టడీ చేసి అందుకు తగ్గట్టు మౌల్డ్ అవ్వాలి. లేదంటే జేబులో ఉన్న రూపాయలన్నీ ఆర్పేస్తారు భజన గాళ్లు. వాళ్లతో తస్మాత్ జాగ్రత్త.
