Begin typing your search above and press return to search.

నిర్మాత ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు..

ఇకపోతే దిల్ రాజు అన్న కుమార్తె కీర్తన పెళ్లి హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో దిల్ రాజు ఆయన భార్య తేజస్విని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

By:  Tupaki Desk   |   31 Oct 2025 6:27 PM IST
నిర్మాత ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు..
X

కార్తీకమాసం మొదలవడంతో సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యుల వరకు చాలామంది ఇళ్ళలో శుభకార్యాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటివరకు బ్యాచిలర్ గా ఉన్న నారా రోహిత్ ప్రముఖ హీరోయిన్ శిరీష తో ఏడడుగులు వేశారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా పేరు సొంతం చేసుకున్న ఆర్జె సూర్య కూడా తాను ప్రేమించిన ఆర్ జే శౌర్యతో నిశ్చితార్థం చేసుకున్నారు. అలాగే కేజిఎఫ్, సలార్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన భువన్ గౌడ కూడా తాను ప్రేమించిన నికితతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. అంతే కాదండోయ్ ఇప్పుడు నిర్మాత దిల్ రాజు ఇంట్లో కూడా పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమార్తె పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో పలువురు టాలీవుడ్ సినీ తారలు, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు కూడా.. ఈ పెళ్లికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను దిల్ రాజు భార్య సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అక్క పెళ్లిలో కష్టపడుతున్న తమ్ముడు అంటూ దిల్ రాజు కుమారుడి వీడియో కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు అభిమానులు సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరో సాయి ధరంతేజ్ , సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్ బాబి కొల్లి కూడా ఈ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు.

ఇకపోతే దిల్ రాజు అన్న కుమార్తె కీర్తన పెళ్లి హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో దిల్ రాజు ఆయన భార్య తేజస్విని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దిల్ రాజు పట్టు వస్త్రాలలో దర్శనమివ్వగా.. ఆయనకు కాంబినేషన్ గా తేజస్విని కూడా ఎల్లో కలర్ పట్టుచీరలో మెరిసి అందాల తారగా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

దిల్ రాజు విషయానికి వస్తే.. వెలమకుచా వెంకటరమణ రెడ్డి గా కెరియర్ ఆరంభించిన ఈయన.. దిల్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. అలా దిల్ రాజుగా పేరు మార్చుకున్నారు.. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత నిర్మాతగా సక్సెస్ అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. ఈ నిర్మాణ సంస్థ ద్వారా బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి, ఉత్తమ నిర్మాతగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. అలాగే సినీ పరిశ్రమకు ఈయన చేసిన కృషికి గాను 2013లో నాగిరెడ్డి చక్రపాణి జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు కూడా.. 2024 డిసెంబర్ 3న తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు.