Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : ఫ్యామిలీతో రాజు గారు

తాజాగా మరోసారి ఫ్యామిలీతో టైం స్పెండ్‌ చేస్తూ సందడి చేశాడు. భార్యతో కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే కాకుండా పిల్లలతో ఉన్న ఫోటోల్లోనూ దిల్‌ రాజు సందడి చేశారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 2:42 PM IST
క్లిక్‌ క్లిక్‌ : ఫ్యామిలీతో రాజు గారు
X

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అనగానే మనకు వినిపించే పేర్లలో దిల్‌ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన టాలీవుడ్‌లో ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ప్రారంభించి పెద్ద వ్యాపార సామ్రాజ్యంను ఏర్పాటు చేశారు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ పేరు దక్కింది. అంతే కాకుండా ఆయన బ్యానర్‌లో సినిమాను చేయాలని చాలా మంది ప్రముఖ హీరోలు కూడా కోరుకుంటారు. ఇక ప్రముఖ దర్శకులు సైతం ఆయన బ్యానర్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంటారు. అలాంటి దిల్‌ రాజు వ్యక్తిగత జీవితం గురించి గతంలో పెద్దగా ఎవరికీ తెలియదు.


కొన్నాళ్ల క్రితం నుంచి దిల్‌ రాజు రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆయన కూతురు, మనవడితో ఉన్న ఫోటోలు వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా ఆయన భార్య, కుమారుడితో ఉన్న ఫోటోలు కూడా ఈ మధ్య తెగ సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొడుకు, మనవడితో ఉన్న ఫోటోలతో దిల్‌ రాజు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాడు. తాజాగా మరోసారి ఫ్యామిలీతో టైం స్పెండ్‌ చేస్తూ సందడి చేశాడు. భార్యతో కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే కాకుండా పిల్లలతో ఉన్న ఫోటోల్లోనూ దిల్‌ రాజు సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.


దిల్‌ రాజును ఈ ఫోటోల్లో చూసిన వారు చాలా మంది ఆయన రోజు రోజుకు యంగ్‌గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం దిల్‌ రాజు గారు ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఫ్యామిలీతో టైం స్పెండ్‌ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉన్నారు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లు కష్టపడ్డ దిల్‌ రాజు గారు ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం మంచి విషయం అని, ఆయన గతంలో మాదిరిగా పూర్తి స్థాయిలో సినిమాల కోసం కష్టపడాల్సిన పని లేదని, ఆయన వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలో వరుస సినిమాలను నిర్మిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అంటున్నారు.


పిల్లలను సైకిల్‌ ఎక్కించుకుని తొక్కడం మొదలుకుని పలు విధాలుగా దిల్‌ రాజు ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్‌ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్నారు. వివాదాల పరిస్కారం మొదలుకుని ఇండస్ట్రీకి, ప్రభుత్వంకు వారధిగా నిలిచారు. ఆయన నిర్మాతగా, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుతూ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో గడపడం అనేది మంచి పద్దతి. సెలబ్రిటీలు గతంలో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేవారు కాదు అంటారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది సెలబ్రిటీలు ముఖ్యంగా స్టార్స్‌ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.