100 కోట్ల ఎల్లమ్మ.. ఏంటి నిజమేనా..?
ఈ సినిమాను కేవలం తెలుగ్ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ భాషలన్నిటిలో కుదిరితే పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
By: Tupaki Desk | 27 Jun 2025 8:15 AM ISTస్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం నితిన్ తో తమ్ముడు సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఊహించని విధంగా సూపర్ బజ్ ఏర్పరచింది. నితిన్ ముందు సినిమాలు పెద్దగా అలరించలేదు. కానీ ఈ సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందనిపిస్తుంది. నితిన్ తమ్ముడు సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత చేస్తున్న ఎల్లమ్మని కూడా ఒక రేంజ్ లో తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు దిల్ రాజు.
బలగం హిట్ తర్వాత వేణు శ్రీరాం చేస్తున్న సినిమాగా ఎల్లమ్మ రాబోతుంది. నితిన్ ఈ సినిమా గురించి చెబుతూ అందులో తాను ఎంత బాగా చేస్తే అంత పేరొస్తుందని చాలా బలంగా చెప్పాడు. సో కథ పరంగా వేణు మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎల్లమ్మ కథతో వేణు మరో సంచలనానికి రెడీ అవుతున్నాడని చెప్పకనే చెబుతున్నారు. నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో ఆమె మరోసారి అభినయంతో అలరిస్తుందని అంటున్నారు.
ఐతే ఎల్లమ్మ సినిమాకు దిల్ రాజు భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. వేణు మార్క్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఎల్లమ్మ వస్తుందట. బలగం బ్లాక్ బస్టర్ కొట్టాడు కాబట్టి వేణుకి అడిగిన బడ్జెట్ ఇస్తున్నాడట దిల్ రాజు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎల్లమ్మ సినిమాకు దిల్ రాజు 100 కోట్ల దాక పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాను కేవలం తెలుగ్ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ భాషలన్నిటిలో కుదిరితే పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
వేణు యెల్దండి ఎల్లమ్మలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయట. ఆడియన్స్ కి పూనకాలు తెప్పించే లాంటి సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. నితిన్ కెరీర్ లో రాబోతున్న తమ్ముడు క్రేజీ మూవీగా వస్తుండగా ఆ తర్వాత ఎల్లమ్మ కూడా వేరే లెవెల్ అనేలా ఉంటుందని అంటున్నారు. బలగం తో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఈ ఎల్లమ్మ సినిమాను వేణు ఎలా తీస్తాడన్నది చూడాలి. తప్పకుండా వేణు ఎల్లమ్మ అంచనాలను అందుకునేలా ఉంటుందని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉంది దిల్ రాజు కాబట్టి వేణు కంటెంట్ బాగుండటం వల్లే ఆయన ఆ బడ్జెట్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
