Begin typing your search above and press return to search.

అలా డిసైడ్ అయిన వాళ్లే సినిమాల్లోకి రండి : దిల్ రాజు

నిర్మాతగా ఈ 30 ఏళ్ల అనుభవంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పెద్ద సినిమాలు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 6:12 PM
అలా డిసైడ్ అయిన వాళ్లే సినిమాల్లోకి రండి : దిల్ రాజు
X

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అంటూ ఒక సరికొత్త వేదిక ఏర్పాటు చేశారు. సినిమాల్లోకి రావాలని అనుకుంటున్న ఔత్సాహికులకు ప్రతిభ గల వారిని ఎంపిక చేసి అవకాశం ఇచ్చేలా దిల్ రాజు డ్రీమ్స్ పనిచేస్తుంది. ఇందులో ముందుగా రిజిస్టర్ చేసుకుని తాము ఏ కేటగిరిలో పనిచేయాలని అనుకుంటున్నారో ఇచ్చిన కాలం లో పొందుపరిస్తే దిల్ రాజు డ్రీమ్స్ టీం వాళ్లని మీట్ అయ్యి వారిలో ప్రతిభ ఉన్నట్టు గుర్తిస్తే ఛాన్స్ లు ఇస్తారు.

నేడు దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు దిల్ రాజు. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, దేవి శ్రీ ప్రసాద్ చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ వేడుకలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ లో తాము ఎదుర్కొన్న కొన్ని సందర్భాలను చెప్పారు. అంతేకాదు సినిమాల్లోకి రావాలనుకునే వారు 100 మంది అయితే అందులో సక్సెస్ అయ్యే వారి శాతం 1 పర్సెంట్ అని అన్నారు.

100 మంది వస్తే అందులో 5 మందికే అవకాశం వస్తుందని. ఆ ఐదుగురిలో నలుగురు ఫ్లాపులు తీస్తారు. ఒక్కడు మాత్రమే హిట్ ఇస్తాడని చెప్పారు. సినిమాల్లోకి రావాలనుకుంటే సరిపోదని దానికి దృద సంకల్పం ఉండాలని అన్నారు. ఏదో ఒక పనిచేస్తూ ప్రయత్నాలు చేయాలని.. లేకపోతే సినిమాల వల్ల ఫ్యామిలీస్ కష్టాల పాలవుతాయని అన్నారు దిల్ రాజు.

నిర్మాతగా ఈ 30 ఏళ్ల అనుభవంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పెద్ద సినిమాలు. దిల్ రాజు ప్రొడక్షన్ లో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. దిల్ రాజు డ్రీమ్స్ తో సెలెక్ట్ అయిన వారికి మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది వెనక బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు. ఈ జనరేషన్ లో నాని, విజయ్ దేవరకొండ అలా వచ్చినవారే అని అన్నారు దిల్ రాజు.

దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా సినిమాకు సంబంధించిన అన్ని కేటగిరీల్లో అవకాశాలు అందిస్తామని. నిర్మాతగా చేయాలని ఉన్నా అలాంటి కేటగిరి కూడా ఒకటి ఏర్పాటు చేశామని అన్నారు. ఇక కెరీర్ మొదట్లో తమకు ఎదురైన అనుభవాల గురించి చెప్పిన దిల్ రాజు అప్పటి నుంచి ఇప్పటివరకు కష్టపడ్డాం కాబట్టే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నామని అన్నారు.